Rajamahendravaram: అగ్రవర్గాలకు ప్రత్యేక శాఖపై ‘తేజోమూర్తుల’ అసహనం – జనసేనతోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది

అగ్రవర్గాల సంక్షేమం కోసం ప్రత్యేకశాఖ ఏర్పాటుకు క్యాబినెట్ నిర్ణయంపై జనసేనజిల్లా కార్యదర్శి, బ్రాహ్మణ సంఘ నాయకులు తేజోమూర్తుల నరసింహమూర్తి అసహనం వ్యక్తపరిచారు. “ఉన్నదానికి మొగుడు లేదు, కడదానికీ కళ్యాణం” అనే సామెత గుర్తొస్తోందని పేరుకు అగ్రకులాలకు ఉన్న బ్రాహ్మణ కార్పొరేషన్ను బీసీ సంక్షేమ శాఖకు బదిలీ చేసి నిర్వీర్యం చేసారని, కాపు కార్పొరేషన్, కాపు రిజర్వేషన్ అతిగతీ లేదని, వైశ్య కార్పొరేషన్ ఇస్తామంటున్నా… ఈనాటికీ అతీగతీ లేదు, జైన్స్, మార్వాడీలు అసలు వీరిని ఎలా ఉన్నారు అని అడిగే నాధుడే లేకుండా పోయాడని ఆవేదన వ్యక్తం చేసారు. రెడ్లు, చౌదరీలు పాపం ఈ రెండు వర్గాల్లో రాజకీయంగా సిఎం చేసిన వారు, చేస్తున్న వారు ఉన్నా ఆ కుటుంబాలు, బంధువులు బాగుపడ్డారే తప్పు, వీరిలో పేదలను పట్టించుకునే వారే లేరని తేజోమూర్తుల గుర్తుచేసారు. ఇప్పుడు సీఎం జగన్ అగ్రవర్ణాలకు మరింత ఏదో చేసేస్తా అంటే, మళ్ళీ ఓట్ల రాజకీయం చేసి, మళ్ళీ నమ్మించి గొంతుకోయటమే అవుతుందని వ్యాఖ్యానించారు. ఇప్పటికే అగ్రకులాల ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని చీదరించుకుంటున్నారని, కేంద్రం ఇచ్చిన అగ్రకులాల రిజర్వేషన్నే ఆంధ్రాలో ఇవ్వలేదూ, అసలు ఉన్నవన్నీ తీసిపడేసి, లేనివి ఏవో అగ్రకులాలకు ఇంకా కొత్త శాఖ ఏదో పెట్టేసి అదేసుకుంటాం అంటూ మోసం చేయవద్దని అన్నారు. ఆగ్రకులాల ప్రజలకు తినే అన్నం లాగేసుకుని, ఎప్పుడో ఎలక్షన్ ముందుగా చారు అన్నం పెడతా అంటే ఎలా అని నిలదీసారు. వీరిని కేవలం ఓటు బ్యాంక్ కిందే ప్రభుత్వం చూస్తూ పూర్తిగా అగ్రకులాలను నిర్లక్ష్యం చేసిందని, ఈ విషయం వైసిపీలో ఉన్న అగ్రవర్ణాల నాయకులకు తెలిసినా, వారికి పదవులు కోసం మాట్లాడలేని పరిస్థితిల్లో వారు ఉన్నారని ఓ ప్రకటనలో తేజోమూర్తులు తెలియజేసారు. ఇప్పటికైనా అగ్రవర్గాల ప్రజలు వైసీపీ కుటిల రాజకీయాలు తెలుసుని జనసేనకు, పవన్ కళ్యాణ్ నాయకత్వానికి అండగా ఉన్డాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో అగ్రవర్గాల అభ్యున్నతికి జనసేన మరింత పోరాడుతుందని, వీరికి అండగా ఉండేది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వమేనని తేజోమూర్తుల నరసింహమూర్తి తెలియజేసారు.