తెలంగాణ: రేపు, ఎల్లుండి జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈనెల 28, 29 తేదీల్లో జరగనున్న ఇంజనీరింగ్, డిగ్రీ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. తిరిగి పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని పేర్కొన్నారు.