అస్తమించిన జనసైనికుడి కుటుంబానికి తెలంగాణ జనసేన ఆర్ధిక సహాయం

హుస్నాబాద్: చివరి క్షణం వరకు జనసేన జండా మోస్తూ అసువులు బాసిన జగిత్యాల నియోజక వర్గం రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామ నిర్వాసితులు ఏర్ధండి వెంకటి. జనసేన పార్టీ కార్యక్రమంలో చురుకుగా పని చేశారు. చనిపోయే కొన్ని గంటల ముందు కూడా రాయికల్ మండలంలో జరిగిన జనంలోకి జనసేన కార్యక్రమంలో పాల్గొని చివరి క్షణం వరకు జనసేన జెండా మోసిన వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు సిద్ధాంతాలకు అనుగుణంగా ఇటిక్యాల గ్రామంలో పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీ జెండా పదిలంగా కాపాడుకుంటూ వచ్చిన వ్యక్తి 40 సంవత్సరాల వయసులో హృద్రోగంతో ఇలా అందరినీ వదిలి వెళ్ళడం చాలా బాధాకరం. శనివారం జగిత్యాల జనసేన పార్టీ ఇంఛార్జి బెక్కం జనార్ధన్ తెలంగాణ రాష్ట్ర నాయకుల ఆదేశం మేరకు ఆ కుటుంబానికి అండగా ఉండడానికి తనకు అందుబాటులో ఉన్న విధంగా మండల నాయకుల సహకారంతో 10000 రూపాయలు అలాగే కుటుంబానికి అండగా తెలంగాణ రాష్ట్ర జనసేన వీరమహిళ నాయకురాలు స్వాతి రెడ్డి 5000 రూపాయలు, శేర్ లింగంపల్లి జనసేన పార్టీ నియోజక వర్గ ఇంఛార్జి డాక్టర్ మాధవ రెడ్డి 5000 రూపాయలు తక్షణ సహాయం అందించడం జరిగింది. మునుముందు ఏర్థండి వెంకటి ఇద్దరు పిల్లల చదువుల నిమిత్తం బాధ్యత తీసుకున్నారు. బెక్కం జనార్ధన్ మాట్లాడుతూ.. జనసేన పార్టీ కుటుంబ సభ్యులకు కష్టం వస్తె పవన్ కళ్యాణ్ గారు ముందుంటారు అనేదానికి ఇదే నిదర్శనం.. రాష్ట్ర నాయకుల సహకారంతో ఆ కుటుంబానికి చేదోడువాదోడుగా ఎప్పుడు ఉంటారని కుటుంబ పెద్దకు బరోసా ఇచ్చారు.. స్వాతి రెడ్డి గారికి మరియు డాక్టర్ మాధవ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియచేశారు. ఈ కార్యక్రమానికి ముందుండి సహకరించిన చిట్టి ఉదయ్ కుమార్ రెడ్డి, సంగణభట్ల వినయ్, ఏడపల్లి హరీష్ గారికి అభినందనలు తెలిపారు. మునుముందు ఇదే విధంగా జనసేన పార్టీ మునుముందు రాష్ట్రంలో ఏ జనసైనికునికి, వీరమహిళకు అండగా పవన్ కళ్యాణ్, రాష్ట్ర నాయకులు అండగా ఉంటారు అని తెలిపారు.