పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

హైదరాబాద్, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు హైదరాబాద్ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి నేమూరి శంకర్ గౌడ్, జనసేన పార్టీ జి.హెచ్.ఎం.సి అద్యక్షులు రాధారం రాజలింగం, జనసేన పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు మరియు సీనియర్ నాయకులు అర్హం ఖాన్, జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు వంగ లక్ష్మణ్ గౌడ్, గ్రేటర్ నాయకులు, వీరమహిళలు, యువజన మరియు విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.