తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల.. ఈ లింక్ తో మీ రిజల్ట్ చెక్ చేసుకోండి

తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వీటిని విడుదల చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలను bse. telangana.gov.in, results.cgg.gov.in తదితర వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచనున్నారు. ఈ సారి హాల్‌టికెట్లు జారీ చేయనందువల్ల.. చదివిన పాఠశాల పేరు, విద్యార్థి పేరు, పుట్టిన తేదీ వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేస్తే హాల్‌టికెట్‌ నంబర్‌తోపాటు ఏ గ్రేడ్‌ వచ్చిందో తెలుసుకోవచ్చు.

ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌(ఎఫ్‌ఏ)-1లో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇచ్చారు. మొత్తం 5,21,393 మంది వార్షిక పరీక్షల కోసం ఫీజులు చెల్లించగా వారందర్నీ పాస్‌ చేస్తున్నట్లు ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది.

విద్యార్థులకు గ్రేడ్ల కేటయింపు ఇలా ఉంటుంది. మొత్తం 100 మార్కులకు గాను 91-100 మార్కులు సాధించిన వారికి A1 గ్రేడ్‌ను కేటాయించారు. 81-90 మార్కులు సాధించిన వారికి A2, 71-80 మార్కులకు B1, 61-70 మార్కులు వచ్చిన వారికి B2, 51-60 మార్కులకు C1 గ్రేడ్, 41-50 మార్కులకు C2, 35-40 మార్కులు సాధించిన వారికి D, 0-34 మార్కులు వస్తే ఈ గ్రేడ్‌ను కేటాయించారు. అయితే ఈ ఏడాది మొత్తం 5,21, 392 మంది విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించారు. ఇందులో దాదాపు 2 లక్షల మంది ఏ1 గ్రేడ్ సాధించినట్లు తెలుస్తోంది.

Results – Direct Link

ఈ విద్యాసంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ స్కూళ్లలో పదో తరగతిలో 5,46,865 మంది విద్యార్థులు అడ్మిషన్ పొందారు. ఈ విద్యార్థులు పరీక్ష ఫీజుగా రూ.150 నిర్ణయించారు. లేట్ ఫీజు రూ.50 తో మార్చి 16 వరకు ఫీజు చెల్లించడానికి గడువు ఇచ్చారు. మార్చి 22 వరకు రూ.500 లేట్ ఫీజుతో పరీక్ష ఫీజు చెల్లించడానికి గడువు విధించారు అధికారులు. అప్పటివరకు 5,21,392 మంది విద్యార్థులు ఫీజు చెల్లించారు. టెన్త్ లో అడ్మిషన్ పొందిన 25,473 మంది విద్యార్థులు గడువులోగా ఫీజు చెల్లించలేదు. ఫీజు చెల్లించకపోవడంతో వారు FA-1 పరీక్షకు హాజరైనా అధికారులు పాస్ చేయలేదు. ఫీజు చెల్లించని వారు ఫెయిల్ అయినట్లేనని అధికారులు స్పష్టం చేశారు.