జనసేన అంటే భయం..!!

*కిరణ్ రాయల్ ను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు

*కిరణ్ రాయల్, రాజారెడ్డి, రాజేష్ యాదవ్, సుమన్ హౌస్ అరెస్ట్

సీఎం జగన్ మోహన్ రెడ్డి తిరుపతి పర్యటనలో భాగంగా తిరుపతి జనసేన పార్టీ ఇంచార్జ్ కిరణ్ రాయల్, పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి, చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి సుమన్ లతో పాటు మరికొందరిని హౌస్ అరెస్టులు చేశారు.. ఈ క్రమంలో కిరణ్ రాయల్ ఇంటివద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

ఏపిలో మహిళలపై జరుగుతున్న అగాయిత్యలపై ప్రశ్నించేందుకు వెళ్తున్న కిరణ్ రాయల్ ను పోలీసులు అడ్డుకున్నారు. జనసేన అంటే మీకు ఎందుకు అంత భయం అంటూ నినాదాలు చేస్తూ.. జనసేన నేతలు ప్రశ్నించారు.