ఆన్‌లైన్‌లో టెట్‌..

తెలంగాణలో భారీగా ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఉద్యోగాలలో పోలీస్ ఉద్యోగాలతో పాటు టీచర్ పోస్టులే అధికంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్షను త్వరలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో త్వరలోనే టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ ఉపాధ్యాయ ఉద్యోగానికి అర్హత కోసం నిర్వహించే టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్‌(టెట్‌)ను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని రాష్ర్ట పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదించింది. ఎంసెట్‌, డీఎడ్ ప్రవేశ పరీక్షల మాదిరిగానే టెట్‌ను కూడా ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు ప్రభుత్వ అనుమతి కోరింది పాఠశాల విద్యాశాఖ. ఒకసారి టెట్ పాసయితే జీవిత కాలం విలువ ఉంటుందని ఇటీవలే జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి(ఎన్‌సీటీఈ) తీర్మానించిన విషయం విదితమే. కానీ తెలంగాణలో టెట్ పాసయితే దాని విలువ ఏడేళ్ల వరకు మాత్రమే ఉంది. ఎన్‌సీటీఈ తీర్మానం నేపథ్యంలో రాష్ర్టంలోనూ జీవోకు సవరణ చేయాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *