విద్యుత్ సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఏఈ రమేశ్ కు కృతఙ్ఞతలు

అన్నమయ్యజిల్లా, టి.సుండుపల్లి మండలంలోని గ్రామీణ ప్రాంతాల పర్యటనలో భాగంగా.. వివిధ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు రైతులు విద్యుత్తు కు సంబంధించిన పనిముట్లు మరియు ప్రజలు పడుతున్న బాధలు.. విద్యుత్ చార్జీల భాదుడు.. పన్నుల రూపంలో ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి జనసేన నాయకులు రామశ్రీనివాసులు సుండుపల్లి ‘ఏఈ’ దృష్టికి తీసుకెళ్లి.. పరిష్కరించాలని కోరగా.. ఈ సమస్యలపై ఏఈ రమేశ్ సానుకూలంగా స్పందించారు.. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తరపున (ఏఈ) రమేశ్ గారికి హృదయ పూర్వక కృతఙ్ఞతలు తెలియజేశారు.