రాష్ట్ర మరియు జిల్లా లీగల్ సెల్ అద్యక్షులకు ధన్యవాదములు

సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడుపై అక్రమ కేసు ఈనెల 9వ తారీకు నాన్ బెయిలబుల్ కేసు పెట్టడం జరిగింది. ఈ కేసు విషయమై నెల్లూరు జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు చదలవాడ రాజేష్ దృష్టికి వెళ్లగా వారు ఈ కేసు నాన్ బెయిలబుల్ కేసు అయినప్పటికీ ఒక చాలెంజ్ గా తీసుకొని చాకచక్యంగా తమదైన శైలిలో అనర్గళంగా తమ వాదనను వినిపించి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేందుకు ఎంతో కృషి చేశారు. అదేవిధంగా యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని పోలీస్ స్టేషన్ లో సబ్మిట్ చేయడం జరిగింది సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి నెల్లూరు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు చదలవాడ రాజేష్ కి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అలాగే రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షులు ప్రతాప్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు.