పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా 50వ రోజు

నాగర్ కర్నూల్ నియోజకవర్గం: పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా 5వ విడత, 50వ రోజు కార్యక్రమంలో నాగర్ కర్నూల్ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, జనసేన పార్టీని బలోపేతం చేస్తూ ఆదివారం నాగర్ కర్నూల్ టౌన్ 2వ వార్డులో జనసేన నాయకులు, జనసైనికులతో కలిసి వంగ లక్ష్మణ్ గౌడ్ పాదయాత్రగా పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరిస్తూ, ప్రజల సమస్యలను తెలుసుకుంటూ కార్యక్రమాన్ని కొనసాగించడం జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ.. 2వ వార్డులో సీసీ రోడ్లు లేవు.. తెలంగాణ రాష్ట్రంలోనే అభివృద్ధి పరంగా నియోజకవర్గం రెండొ స్థానంలో ఉంది అని అధికార పార్టీ నాయకులు చెప్పుకుంటూ పబ్బం గడుపుతున్నారు.. ఇక్కడికి వచ్చి చూస్తే పరిస్థితి ఎలా ఉంది అంటే, వర్షం పడ్డదంటే ప్రజలు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కాలు జారీ కింద పడి తలలు పగలగొట్టుకునే విధంగా ఉన్నాయి. రోడ్ల మధ్య గుంటలు ఉన్నాయో లేక.. గుంటల మధ్య రోడ్లు ఉన్నాయో అర్థం కాలేదు. ప్రజల్లో చైతన్యం వస్తేనే మార్పు మొదలవుతుంది. వచ్చే ఎన్నికల్లో స్వార్థ రాజకీయ పార్టీలకు ప్రజలు స్వస్తి పలకడం ఖాయం. 35, 40 సంవత్సరాలుగా మాయ మాటలతో వాళ్ళ పబ్బం గడుపుకున్న రోజులు అయిపోయినయి, ఒక వర్గ పాలనతో నలిగిపోతున్న నాగర్ కర్నూల్ నియోజకవర్గాన్ని జనసేన పార్టీ తరపున విముక్తి చేస్తాం. ఈ సారి అలా ఉండదు, బహునులు అందరూ ఏకదటిపై చేరుకొని, వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకి తగిన బుద్ధి చెప్తారు. రానున్న ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి జనసేన పార్టీని ఆశీర్వదించగలరని మనవిచేసారు.
ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క జనసైనికుడికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.