మత్స్యకారుల కుటుంబాల్లో వెలుగులు నింపడమే జనసేన లక్ష్యం

నరసాపురం నియోజకవర్గం: జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం నరసాపురం నియోజకవర్గ ఇంచార్జి, పీఏసీ సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్ బొమ్మిడి నాయకర్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో నాయకర్ మాట్లాడుతూ.. మత్స్యకారులను జగన్ ప్రభుత్వం మభ్యపెడుతుందని జనసేన నర్సాపురం నియోజకవర్గ ఇన్చార్జి బొమ్మిడి నాయకర్ అన్నారు. అటు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలలోనూ మత్స్యకారులకు మేలు చేశామని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. ఆక్వా యూనివర్సిటీ ఒక మెట్టు కూడా కదల్లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఫిషింగ్ హార్బర్ నిర్మాణం అంటూ గాల్లో పేక మేడలు కట్టారని అన్నారు. పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్న మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలని లేకపోతే తగిన మూల్యం చెల్లించిక తప్పదు అన్నారు. జూన్ 24, 25వ తేదీలలో జరగబోయే వారాహి యాత్రను జనసేన నాయకులు, అభిమానులు అందరూ జయప్రదం చేసి విజయవంతం చేయాలని ఆయన కోరారు. రాబోయే కాలంలో పవన్ సీఎం అవ్వడం తధ్యమని, దానిని ఎవరు ఆపలేరని నాయకర్ స్పష్టం చేశారు. ప్రజల్లో పవన్ కు పెరుగుతున్న ఆదరణ చూసే వైసీపీ నాయకులు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని దానిని ప్రజలందరూ గమనిస్తున్నారని, ఎన్నికలలో అధికార పార్టీకి తగిన బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. ప్రజానాడి జనసేన వైఫై ఉందని తప్పకుండా జనసేన ప్రభుత్వం అధికారుల్లో వస్తుందని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ మాత్రమే మత్స్యకారులకు తగిన న్యాయం చేస్తారని, మత్స్యకారుల కుటుంబాల్లో వెలుగులు నింపడమే జనసేన లక్ష్యం అని నాయకర్ స్పష్టం చేశారు. అనంతరం వారాహి యాత్ర పోస్టర్ ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులకు, వీరమహిళలు పాల్గొన్నారు.