జనసేన బలోపేతమే లక్ష్యంగా కృషి చేయాలి

శ్రీకాకుళం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్ళాణ్ పిలుపు మేరకు, నాదెండ్ల మనోహర్ సూచనలు మేరకు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిషిణి చంద్రమోహన్ అధ్వర్యంలో మంగళవారం శ్రీకాకుళం జిల్లాలో ఉన్న జనసేన సమన్వయకర్తలు మరియు ముఖ్యనాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు సమావేశానికి ప్రతి ఒక్కరూ హజరైనారు. ఈ సమావేశంలో చంద్రమోహన్ మాట్లాడుతూ త్వరలో గ్రామకమిటీలు బూత్ కమిటి ఏజెంట్లు మండల కమిటీలు, నియోజకవర్గం కమిటీలు యాక్టీవ్ గా పనిచేసినవారిని గుర్తించి బాధ్యత అప్పగించాలని జనసేన పార్టీ మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలని అయన మాట్లాడారు.