వైసీపీ అంతం జనసేన పంతం

  • జనసేన పార్టీలోకి డాబవలస గ్రామ యువత

అరకు: హుకుంపేట మండల నాయకులు బలిజ కోటేశ్వరరావు పడాల్
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గం హుకుంపేట మండలం పట్టం పంచాయతీ, డాబవలస గ్రామంలో జనసేన పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హుకుంపేట మండల నాయకులు బలిజ కోటేశ్వరరావు పడాల్ మాట్లాడుతూ.. వైసీపీ పార్టీ సిద్ధాంతం గిరిజన ప్రజల మనుగడ స్థితిని నిర్వీర్యం చేయడం వైసీపీ ప్రజాప్రతినిధుల అంతిమ లక్ష్యం. గిరిజన ప్రజల సహజ సంపద కొల్లగొట్టడం మన గిరిజన ప్రజాప్రతినిదులు స్వజాతి భక్షకులు ఎన్నో కోల్పోయాం. ఈ ప్రభుత్వ హయాంలో ఇంకోసారి అధికారమిస్తే ఇంకెన్ని కోల్పోవలిసివస్తుందో బుద్ది ఉన్న ప్రతి గిరిజన యువతి యువకుడు గమనించవచ్చు. అందుకే వైసీపీ అంతం జనసేన పంతం ఈ గిరిజన ప్రాంతానికి కడప ఫ్యాక్షన్ సంస్కృతి రాజకీయాలు వద్దు వాటిని తరిమికొట్టాల్సిందేనన్నారు.అరకు నియోజకవర్గ ఇన్చార్జ్ చెట్టి చిరంజీవి మాట్లాడుతూ అవినీతితో అధికారం శాశ్వతమనుకొనే వైసీపీ ప్రభుత్వానికి త్వరలోనే గిరిజన ప్రజలు బుద్ది చెప్తారు. ఎందరో నిరుద్యోగులు ఆత్మహత్యకు కారణమయ్యారు కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. జాతీయస్థాయిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మొదటి స్థానం ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వంలో సమాజంలో అన్నివర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేశారు యువతకు ఉద్యోగాలు లేవు, గిరిజన ప్రజల అస్తిత్వంపై చీకటి తీర్మానాలు చేశారు సగటు గిరిజన యువకుడిగా ఇటువంటి పాసిస్టు ప్రభుత్వాన్ని ఇంటికి సాగణంపాల్సిందేనన్నారు. ఈ సందర్బంగా జనసేన పార్టీ సిధ్ధాంతాలు, ఆశయాలు నచ్చి యువకులు భారీగా జనసేన పార్టీలో చేరారు. వారికి అరకు జనసేన పార్టీ ఇన్చార్జ్ చెట్టి చిరంజీవి,బలిజ కోటేశ్వరరావు పడాల్ కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో కిల్లో రమేష్, డుంబేరి చిరంజీవి ఆధ్వర్యంలో యువత భారీగా జనసేన పార్టీలో సుమారుగా అరవై కుటుంబాలు చేరింది. గ్రామస్తులు పిలుపు మేరకు అరకు నియోజక జనసేన పార్టీ ఇంచార్జ్ చెట్టి చిరంజీవి, జిల్లా సంయుక్త కార్యదర్శి కొన్నేడి లక్ష్మణ్ రావు, ఉమ్మడి జిల్లా కార్యనిర్వాహక సభ్యులు పరదాని సురేష్, హుకుంపేట మండల ముఖ్య నాయకులు బలిజ కోటేశ్వరరావు పడాల్, రాంబాబు సురకత్తి, శోభ అర్జున్, పరశురాం సింబోయి, మజ్జి మహేష్, సిందికోడి శంకర్ పాల్గొన్నారు.