జనసేన బంధు పిలుపుతో ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ నియామకం

ఇచ్ఛాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి దాసరి రాజు రెండు సంవత్సరాలుగా నియోజకవర్గ ప్రభుత్వ సి.హెచ్.సి హాస్పిటల్లో సిబ్బంది కొరత విషయములో అనేకసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లి జనసేన పార్టీ తరపు ధర్నాలు చేసినప్పటికీ కూడా కనీసం పరిగణలోకి తీసుకోలేదు. అయితే చివరికి జనసేన పార్టీ బందుకు పిలుపునివ్వడంతో అనేక సంఘాలు యూనియన్ ప్రెసిడెంట్ కలిసి బ్యాంక్ మేనేజర్ లకు సంప్రదించి సహకరించవలసినదిగా సోమవారం బంద్ కు పిలుపునివ్వడంతో ఆదివారం సెలవుదినం అయినప్పటికీ కూడా హుటాహుటిగా ఇద్దరు డాక్టర్స్ ని డిప్యుటేషన్ వేయడం జరిగింది. జనసేన ఏదైతే బంద్ కు పిలుపునిచ్చిందో చిరు వ్యాపారస్తుల నుండి పెద్ద వ్యాపారస్తుల వరకు ప్రతీ ఒక్కరూ స్వచ్ఛందంగా మద్దతు ఇవ్వడంతో ఈ సమస్య ఏ స్థాయిలో ఉందో ప్రతీ ఒక్క రాజకీయ నాయకుడు, ప్రభుత్వ అధికారులు గుర్తించవలసిందిగా కోరుకుంటున్నాము. ఈ బంద్ ను విజయవంతం చేసినందుకు ప్రతీ ఒక్క వ్యాపారస్తులకు, యూనియన్ ప్రెసిడెంట్ లకు, బ్యాంక్ అధికారులకు, ప్రజలకు అందరికీ జనసేన పార్టీ తరపున ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర జాయింట్ సెక్రటరీలు తిప్పన దుర్యోధనరెడ్డి, బైపల్లి ఈశ్వరరావు, రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ కార్యదర్శి నాగుల హరి బెహరా మరియు జనసేన నాయకులు, జనసేన వీరమహిళలు, జనసైనికులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని బంద్ ని విజయవంతం చేశారు. పత్రికా సోదరులకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.