ప్రమాదానికి గురైన జనసైనికులు జగదీష్, శ్రీకాంత్ ను పరామర్శించిన గాదె

గుంటూరు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పర్చూరు పర్యటనలో భాగంగా ప్రమాదవశాత్తు గాయపడిన గుంటూరు జిల్లా జనసైనికులను జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పరామర్శించారు. చిలకలూరిపేట జనసైనికుడు శ్రీకాంత్ ను ప్రభుత్వ హాస్పిటల్ లో, కొప్పురావురుకి చెందిన జగదీష్ ను ఆదిత్య హాస్పిటల్లో పరామర్శించి ధైర్యం చెప్పారు. డాక్టర్లను అడిగి ఆరోగ్య సమాచారం తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పార్టీ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు.