హౌసింగ్ బోర్డ్ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ నిర్మించాలి: తిరుపతి అనూష

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం: 42 డివిజన్, హౌసింగ్ బోర్డ్ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ నిర్మించాలని 42వ డివిజన్ జనసేన అధ్యక్షురాలు తిరుపతి అనూష పేర్కొన్నారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ 42 డివిజన్, హౌసింగ్ బోర్డ్ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ నిర్మించకుండా వైస్సార్సీపీ పబ్లిసిటీ కోసం పార్కు నిర్మాణం చేపట్టారు. అది కూడా గత సంవత్సరం కాలం నుంచి చేస్తూనే ఉన్నారు. దీనివల్ల ఇక్కడ 300 కుటుంబాలు నీళ్లలో నడచి వెళ్ళాల్సిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా పవర్ సప్లై ప్యానెల్ బాక్సులు ప్రతి బ్లాక్ కిందఉన్నాయి. అవన్నీ ఎర్త్ అయితే వీళ్ళందరికీ షాక్ కొట్టే పరిస్థితివస్తుందని భయాందోళనలో అక్కడ స్థానిక ప్రజలు ఉన్నారు. మంగళవారం రాత్రి ఇక్కడ 4 ప్యానెల్ బోర్డులు కాలిపోయి చాలామందికి కరెంట్ లేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటివరకూ ఈ సంస్యపై స్థానిక కార్పొరేటర్ కానీ, స్థానిక ఎమ్మెల్యే గాని, అధికారులుగాని పట్టించుకున్న పరిస్థితి లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంస్యపై ఈ పనికిమాలిన పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే వెల్లంపల్లి శీనుఅభివృద్ధి చేశాను అని చెప్పి ప్రెస్ మీట్ లు పెట్టి డబ్బా కొట్టుకోవడం తప్ప, అదే విధంగా మా పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఏడవటం తప్ప పశ్చిమ నియోజకవర్గంలో చేసింది ఏమీ లేదని ఈయన సీటు కాపాడుకోవడం కోసమే మా పవన్ కళ్యాణ్ గారి మీద, మా పోతిన మహేష్ గారి మీద పడి పిచ్చికుక్కలా మొరుగుతా ఉంటాడు.. తక్షణమే అధికారులు స్పందించి ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ నిర్మించాలని జనసేన పార్టీ తరఫునుంచి డిమాండ్ చేస్తున్నమని అనూష తెలియజేసారు.