గునుకుల కిషోర్ కు రాఖీ కట్టిన జనసేన వీరమహిళలు

  • రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్

నెల్లూరు: రక్షాబందన్ పురస్కరించుకొని బుధవారం జనసేన నాయకులు గునుకుల కిషోర్ కి జనసేన పార్టీ రాష్ట్ర సెక్రటరీ ఆకేపాటి సుభాషిని, రీజినల్ కోఆర్డినేటర్ కోలా విజయలక్ష్మి, నెల్లూరు నగర వీరమహిళలు రేణుకా, హైమావతి నెల్లూరు రూరల్ వీరమహిళ రేవతి రక్షాబంధన్ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ.. నా అన్నను ముఖ్యమంత్రి చేసుకోవడం.. అభిమానిస్తున్న నా ఆడపడుచుల కోరిక. రాఖీ పౌర్ణమి శుభ ఘడియలలో సోదరుడు చల్లగా ఉండాలని దీవించిన నా ఆడపడుచుల కోరిక తీరేవరకు నా శక్తివంచన లేకుండా కష్టపడుతానని తెలియజేస్తూ అక్కచెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.