పట్టణ సి.ఐ కి పిర్యాదు చేసిన వీరమహిళలు

పాలకొల్లు, పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పురస్కరించుకొని పట్టణ నడిబొడ్డులో వీర మహిళా విభాగం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని ఎవరో దుండగులు చింపివేయడం జరిగింది. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని మరోసారి ఇలాంటి చర్యలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని సి.ఐ అఖిల్ జామాని కలసి వీర మహిళా విభాగం తరపున రియా, షేక్ వలియా బేగం మరియు దేవరపు ఝన్సీతో కలసి వెళ్లి ఫిర్యాదు చేయడం జరిగింది. మాకు సపోర్ట్ గా జిల్లా సెక్రటరీ బోనం చినబాబు, జిల్లా జాయింట్ సెక్రటరీ ఉన్నమట్ల ప్రేమ్ కుమార్ పెనుమదం ఎంపీటీసీ మానేపల్లి శ్రీధర్, పోడూరు మండల అధ్యక్షులు పీతాని వెంకటేష్, జనసేన నాయకులు అంబటి విజయ్ కుమార్, బిట్టా లక్ష్మి నారాయణ, గంట ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు.