డిఫెన్స్ అకాడ‌మీలోకి మ‌హిళ‌ల ప్ర‌వేశానికి కేంద్రం ఓకే

నేషన‌ల్ డిఫెన్స్ అకాడ‌మీలోకి మ‌హిళ‌ల‌ను అనుమ‌తించే విష‌యంలో కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. సుప్రీంకోర్టులో విచార‌ణ సంద‌ర్భంగా మ‌హిళ‌ల‌ను అనుమ‌తించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు పేర్కొంది. త్రివిద ద‌ళాల అధిపతుల‌తో చ‌ర్చించాకే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇదే నిర్ణ‌యాన్ని నావ‌ల్ అకాడ‌మీకి కూడా వ‌ర్తింప‌జేయ‌నున్న‌ట్లు పేర్కొంది.


ఎలాంటి లింగ భేదం ఉండ‌కూడ‌ద‌ని చాలా రోజులుగా తాము చెప్తున్నామ‌న్న జ‌స్టిస్ ఎస్.కే కౌల్… ఇందులో త్రివిధ ద‌ళాలు ముందుండాల‌ని తాము కోరుకుంటున్నామ‌న్నారు. చివ‌ర‌కు త్రివిద‌ ద‌ళాలు తీసుకున్న నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్నామ‌న్నారు.

ఆగ‌స్టు 18న విచార‌ణ సంద‌ర్భంగా మ‌హిళ‌ల‌కు డిఫెన్స్ అకాడ‌మీలో ప్ర‌వేశాల‌తో పాటు క‌మిష‌న్ ఏర్పాటు చేయాల్సిందేన‌ని కేంద్రాన్ని ఆదేశించింది. ఇప్ప‌టి వ‌ర‌కు తాత్కాలిక బేసిస్ లో మాత్ర‌మే క‌మిష‌న్ లో మ‌హిళ‌ల‌కు ప్ర‌వేశం ఉండేది. దీన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిష‌న్ లు దాఖ‌లు కాగా… చివ‌ర‌కు కేంద్రం, త్రివిద ద‌ళాలు అంగీక‌రించాయి.