కేంద్రం పీవీకి భారతరత్న ఇవ్వాలి

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇచ్చేలా కేంద్రంపై, ప్రధానిపై ఒత్తిడి తేవాల్సిందిగా సీఎం కేసీఆర్‌కు పీవీ జయంత్యుత్సవాల కమిటీ సభ్యుడు, టీఆర్‌ఎస్‌ ఎన్నారై కోఆర్డినేటర్‌ మహేశ్‌ బిగాల విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రిని కలిసి 80 పైచిలు కు ఎన్నారై సంస్థల తరఫున వినతిపత్రా న్ని అందజేశారు. పీవీ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడంపై ముఖ్యమంత్రికి ఎన్నారైల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా, కెనడా, జర్మనీ, స్విట్జర్లాండ్‌, మారిషస్‌, డెన్మా ర్‌, స్వీడన్‌, న్యూజిలాండ్‌, లాత్వియా తదితర 50 దేశాల్లో ఘనంగా ఉత్సవాల ను నిర్వహించినట్టు సీఎం కేసీఆర్‌కు వివరించారు. మహేశ్‌ బిగాల కృషిని ప్రశంసించిన సీఎం కేసీఆర్‌.. ఉత్సవాల్లో పెద్దఎత్తున పాల్గొన్న ఎన్నారైలు, సంస్థలను అభినందించారు. మంత్రి కేటీఆర్‌తో కలి సి విదేశాలలో ఉత్సవాలను నిర్వహించినట్టు మహేశ్‌ తెలిపారు. వివిధ దేశాల్లో జూమ్‌కాల్‌ ద్వారా నిర్వహించిన కార్యక్రమాల్లో కమిటీ చైర్మన్‌ కేశవరావు, ఎమ్మెల్సీలు కవిత, వాణీదేవి, పీవీ కుమారుడు ప్రభాకర్‌రావు, ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్‌ వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌, పీవీ మనుమడు కశ్యప్‌తోపాటు పలువురు అతిథులు పాల్గొన్నారన్నారు. ఎన్నారై సంస్థల కమి టీ సభ్యులు ప్రసాద్‌, స్వర్ణల బృందానికి అభినందనలు తెలియజేశారు.