జనసేన, టిడిపి కలయికతో రాబోయే ఎన్నికలలో ఘనవిజయం

చిత్తూరు: జనసేన, టిడిపి కలయికతో రాబోయే ఎన్నికలలో ఘనవిజయం సాదిస్తుందని చిత్తూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్ తులసి ప్రసాద్ పేర్కొన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురువారం రాబోయే ఎన్నికల పొత్తు గురించి తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేసేందుకు సూచనప్రాయంగా అంగీకారం తెలిపారు. ఆంధ్ర రాష్ట్రంలో రాక్షసుడి పాలన ప్రజలు అనేక కష్టాలు పడుతున్నారని, వారిని కాపాడుకోవాల్సిన అవసరం రీత్యా రాజకీయంగా కొంతమందితో కలిసి ముందుకు వెళ్లాలని పవన్ కళ్యాణ్ అంగీకరించారని తెలియజేశారు. మిత్ర పార్టీ అయిన బిజెపితో కూడా ఆంధ్ర రాష్ట్ర దుస్థితిని వివరించి కలిసి వెళ్లే ప్రయత్నం చేస్తారని ఆశా భావం వ్యక్తం చేశారు. తదుపరి పార్టీ ఆదేశాల వచ్చేవరకు, సంయమనం పాటిస్తూ ఇతర పార్టీ నాయకులతో కలుపుగోలుగా ప్రవర్తిస్తూ, జనసేన పార్టీని ప్రజల వద్దకు తీసుకెళ్లాలని చిత్తూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్ తులసి ప్రసాద్ తెలియజేశారు.