వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి

  • మాజీ మంత్రి పరిటాల సునీతని పరామర్శించిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య

అనంతపురం: మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుని నిరసిస్తూ మాజీ మంత్రి పరిటాల సునీత చేపట్టినటువంటి ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేసి పోలీసులు అక్రమంగా పరిటాల సునీత గారినీ విచక్షణ రైతంగా ఈడ్చుకెళ్తూ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన విషయం తెలుసుకొన్న జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి స్థానిక అనంతపురంలోని పరిటాల సునీత స్వగృహం నందు పరామర్శించి మద్దతు తెలపడం జరిగింది. పోలీసు వ్యవస్థను అడ్డంపెట్టుకుని శాంతియుతంగా దీక్ష చేపడుతున్నటువంటి మాజీ మంత్రి పరిటాల సునీత దీక్షను భగ్నం చేస్తూ మహిళలు అనకుండా విచక్షణ రహితంగా లాక్కొని మహిళలను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి, పరిటాల సునీత గారిని ఆస్పత్రికి చేర్పించిన విధానంపై చిలకం మధుసూధన్ రెడ్డి గారు తీవ్రంగా మండిపడడం జరిగింది. ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి. ఈ ప్రభుత్వంలో శాంతియుతంగా కూడా దీక్షలు చేయడానికి కూడా హక్కు లేకుండా ప్రజల హక్కులను కాలరాస్తూ రాజారెడ్డి రాజ్యాంగాన్ని రాష్ట్రంలో నడిపిస్తున్నటువంటి జగన్ రెడ్డిని ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్పి ఇంటికి పంపిస్తారని హెచ్చరించడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు గారిని వారి స్వగృహం నందు పరామర్శించి రాయదుర్గంలో వారి దీక్షను భగ్నం చేసి అక్రమ అరెస్టు చేసిన విధానంపై ఆరా తీస్తూ వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకొని పరామర్శించడం జరిగింది, భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మిడి కార్యక్రమంలో గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, రాప్తాడు నియోజకవర్గ ఇన్చార్జ్ సాకే పవన్, గార్లదిన్నె జనసేన నాయకులు మూలి శ్రీకాంత్ రెడ్డి, జనసేన నాయకులు పాల్గొని మద్దతు తెలపడం జరిగింది.