అంగన్వాడీల న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

  • జనసేన పార్టీ నాయకులు అతికారి దినేష్

రాజంపేట: అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ గత మూడు రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు చేస్తున్న రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మెకు జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు అతికారి దినేష్ సంఘీభావం తెలిపారు. అంగన్వాడీలు ఐసిడిఎస్ కార్యాలయం వద్ద సిఐటియు, ఏఐటియుసి చిట్వేల్ రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెలో గురువారం జనసేన పార్టీ నాయకులు అతికారి దినేష్ తన సంపూర్ణ మద్దతును తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలకు కనీస వేతనం రూ 26 వేలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ 5 లక్షలకు పెంచాలని అన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ అమలు చేయాలని, మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా మార్చాలని, మినీ వర్కర్లకు ప్రమోషన్లు కల్పించాలని, ప్రమోషన్ వయసు 50 సంవత్సరాలకు పెంచాలని, ఆఖరి వేతనంలో 50 శాతం పెన్షన్ ఇవ్వాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవ్ మంజూరు చేయాలని కోరారు. సంపూర్ణ పోషణ మెనూ ఛార్జీలు పెంచాలని, సర్వీసులో ఉండి మృతి చెందిన అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని తదితర డిమాండ్లపై అంగన్వాడీలు చేస్తున్న సమ్మె న్యాయ పరమైనదని అన్నారు. న్యాయపరమైన అంగన్వాడీల డిమాండ్లు నెరవేర్చడం ప్రభుత్వ బాధ్యత అని గుర్తు చేశారు. అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ద్రుష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం అయ్యేవరకు అంగన్వాడీలకు జనసేన అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, సిఐటియు, ఎఐటియుసి నాయకులు ఎం ఎస్ రాయుడు, సికిందర్, నరసింహ జనసేన పార్టీ నాయకులు పోలిశెట్టి శ్రీనివాసులు గుగ్గిల నాగార్జున ఓబులేసు కొండల గారి రవి నేతి వెంకటేష్ గోపి వీరయ్య ఆచారి తదితరులు పాల్గొన్నారు.