దోషులను వెంటనే శిక్షించాలని పితాని డిమాండ్

ముమ్మిడివరం, కాట్రేనికోన మండలం బలుసుతిప్ప పంచాయితీ మగసాని తిప్ప గ్రామానికి చెందిన జనసైనికుడు పాలెపు మహేష్ పై అదే గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకులు అసాంఘిక కార్యక్రమాలు నడుపుతూ పాత కక్షల కారణంగా దాడి చేయడం జరిగింది. ముమ్మిడివరం శరణ్య ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్న అతనిని మంగళవారం జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ పరామర్శించి దోషులను వెంటనే శిక్షించాలని పోలీసు వారిని డిమాండ్ చేశారు. వారితో పాటు జక్కంశెట్టి పండు, పెమ్మాడి గంగాద్రి సంగాన్ని ధనలక్ష్మి, ఓలేటి శ్రీను, పెమ్మడి శ్రీను తదితరులు పాల్గొన్నారు.