విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను విస్మరించరాదు

  • అత్యవసరాలు సామాన్యులకు ఖరీదు కారాదు
  • పాలకుల దురాగతాలపై ప్రజలు ప్రశ్నించాలి
  • క్విట్ ఇండియా కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకుల డిమాండ్

పార్వతీపురం నియోజకవర్గం: విద్య, వైద్యం, వ్యవసాయం తదితర ప్రాథమిక అత్యవసరమైన రంగాలను ప్రభుత్వాలు విస్మరించరాదని జనసేన పార్టీ నాయకులు కోరారు. బుధవారం పార్వతీపురంలోని సుందరయ్య భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బంటుదాసు ఆధ్వర్యంలో జరిగిన క్విట్ ఇండియా కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు వంగల దాలి నాయుడు, అన్నాబత్తుల దుర్గాప్రసాద్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల జీవనానికి ఆధారమైన ప్రాథమిక రంగాలైనటువంటి విద్య వైద్యం వ్యవసాయం తదితరవి సగటు మానవుడికి అందుబాటులో ఉండేలా రక్షించాలన్నారు. అయితే ప్రస్తుతం విద్య వైద్యం తడితరవి కార్పొరేట్ వ్యక్తుల చేతిలో సామాన్యుడికి అందనంత ఖరీదుగా మారాయి అన్నారు. ప్రస్తుతం వ్యవసాయ రంగం కూడా అదే బాటలో పయనినిస్తోందన్నారు. ప్రకృతి వనరులైన ఇసుక, మట్టి నీరు అమ్ముకునే దౌర్భాగ్యం రాష్ట్రంలో ఉందన్నారు. ఇక వ్యవసాయ రంగం కూడా కార్పొరేటు చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. కోవిడ్ సమయంలో ప్రపంచమంతా వణికిపోతే భారతదేశం మాత్రం ఆహారం విషయంలో కనీసం భయపడలేదు అన్నారు. ఎందుకంటే రైతు కోవిడ్ సమయంలో పంటలు పండించే విషయంలో వ్యవసాయ రంగాన్ని ఆపలేదన్నారు. మిగతా రంగాలన్నీ దాదాపు మూత పడినప్పటికీ వ్యవసాయ రంగం మాత్రం నడిచింది అన్నారు. అందుకే ప్రజలకు ఎటువంటి ఆహార కొరత ఆరాలేదన్నారు. ప్రస్తుతం రాభుత్వాలు అవలంబిస్తున్న రైతు వ్యతిరేక చర్యల వలన రైతులు వ్యవసాయానికి దూరమవుతున్నారన్నారు. ఈ ఏడాది రైతులు కోరిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు యాంత్రికరణ పరికరాలు అందజేయకపోవడంతో రైతులు ఇప్పటికీ నాట్లు వేసేందుకు తంటాలు పడుతున్నారన్నారు. ఇక ధరలు నియంత్రణ చేపట్టి సామాన్యుడికి ఊరట కల్పించాలన్నారు, సామాన్యుడికి కూడు గూడు గుడ్డ కనీసం అందించే స్థాయిలో ప్రభుత్వాలు ఉండాలన్నా అన్నారు. ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక కార్యక్రమాలు చేపట్టేటప్పుడు ప్రజలు చైతన్యవంతమై ప్రశ్నించే అలవాటు చేసుకోవాలన్నారు. తమ జనసేన పార్టీ వ్యవస్థాపకులు జనసేనాని కొణిదెల పవన్ కళ్యాణ్ అన్యాయాలు అక్రమాలు అవకతవకలు ప్రతి ఒక్కరు ప్రశ్నించాలని పిలుపునిస్తున్నారన్నారు. కాబట్టి ప్రజలు చైతన్యవంతమై జరిగిన అన్యాయంపై గొంతువిప్పి ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.