జనసేన పార్టీ తరఫున ప్రథమ బహుమతి ప్రధానం

గాజువాక నియోజకవర్గం, ఫార్మసిటీ కాలనీ రాయల్ యూత్ ఆధ్వర్యంలో శ్రీ సిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవం సందర్భంగా నిర్వహించిన కబడ్డీ పోటీలకు ప్రథమ బహుమతికి రూ. 10000/- స్పాన్సర్షిప్ చేసిన జనసేన పార్టీ గాజువాక నియోజవర్గం సీనియర్ నాయకులు మరియు అగనంపూడి స్థానిక యువ పారిశ్రామికవేత్త బలిరెడ్డి అరవింద్ మరియు జనసేన పార్టీ సీనియర్ నాయకులు దాసరి రమేష్. జనసేన పార్టీ తరఫున ప్రథమ బహుమతిని ప్రధానం చేసిన జనసేన పార్టీ గాజువాక నియోజకవర్గం సీనియర్ నాయకులు మరియు జీవీఎంసీ 85వ వార్డు ఇంచార్జ్ గవర సోమశేఖర్ రావు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వార్డ్ జనసేన నాయకులు దాసరి శ్రీనివాసరావు, దాసరి శ్రీను (ఆర్టీసి), దాసరి అచ్యుత్, దాసరి కాళిదాసు, గణేష్, రాజేష్, రమేష్, డాక్టర్ తాతాజీ సాయి, రాయల్ యూత్, ఫార్మాసిటీ గ్రామాల జనసైనికులు మరియు వీర మహిళలు పాల్గొన్నారు.