ఆత్మకూరులో పవనన్న ప్రజాబాట మూడవరోజు

ఆత్మకూరు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేయాలన్న సంకల్పంతో ఆత్మకూరు నియోజకవర్గంలో మొదలుపెట్టిన పవనన్న ప్రజాబాట కార్యక్రమం మంగళవారానికి మూడో రోజుకు చేరుకుంది. ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డుకు చెందిన నర్సాపురం, జాలయ్య నగరాలో మంగళవారం పర్యటించి అక్కడ స్థానిక సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జ్ నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో ఉన్నప్పటికీ, ఒకటో వార్డులో అనేక సమస్యలు ఉన్నాయని, ముఖ్యంగా ప్రజల ప్రాథమిక అవసరాలైన రోడ్లు, డ్రైనేజీ మరియు మంచినీటి సౌకర్యం లాంటి కనీస అవసరాలు కూడా ప్రజలు నోచుకోలేకపోవడం ఎంతో దురదృష్టకరమని పేర్కొన్నారు. 2024 సాధారణ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుందని అప్పుడు ఆత్మకూరు మున్సిపాలిటీ ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు సురేంద్ర, వంశీ, చంద్ర, సురేష్, అనిల్, నాగరాజు, భాను కిరణ్, వేణు తదితరులు పాల్గొన్నారు.