యస్వి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో వెబ్ సిరిస్ మొదటి షెడ్యూల్ పూర్తి

యస్వి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం 4 వెబ్ సిరిస్ కు నంద్యాల సాయి కళ్యాణ్ దర్శకత్వం నిర్మాత వరుణ్ కుమార్ వహిస్తున్నారు. కెమెరా మ్యాన్ గౌరీ సాగర్, సంగీతం సుజీత్, కథానాయకుడు గౌరీ నాయుడు కథనాయిక వినిషా, కామెడియన్ ఆవేశం స్టార్, నెల్లూరుకు సంబంధించిన కళాకారులు నటించారు. ఈ చిత్ర షూటింగ్ నెల్లూర్ లోని పరిసర ప్రాంతాలలో 15 రోజులపాటు జరిగింది. దర్శక నిర్మాతలు నద్యాల సాయి కళ్యాణ్, వరుణ్ లు మాట్లాడుతూ మేము వేసుకున్న బడ్జెట్ లో షూట్ జరుతుందో లేదో అని భయపడుతున్న సమయంలో టీమ్ సభ్యులు అందరం కలిసి చాలా బాగా కష్టపడి ప్రోజెక్ట్ మంచి ఔట్ పుట్ తో మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి అవటం గర్వంగా సంతోషిస్తున్నాము అన్నారు. అలాగే వెబ్ సిరిస్ సంబంధించిన టైటిల్ పోస్టర్ను 30 వెడ్స్21 ఫేమ్ చైతన్య రావు మరియు జబర్దస్త్ డైరెక్టర్ శ్రీపాద మరియు ఇమ్మానియేల్ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేయడం జరిగింది. వెబ్ సిరిస్ ప్రోజెక్ట్ అద్బుతంగా వచ్చింది త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు నిర్వహిస్తాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతమళ్ళ నాగరాజు, అమర్, అనిల్, సాజిద్, హేమంత్, ఆది, తదితరులు పాల్గొన్నారు.