రోడ్లు గుంతల్లో పడి ప్రాణాలు పోతున్న రోడ్ల మరమ్మతులు పట్టించుకోని ప్రభుత్వం

సింగనమల, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు టి.సి వరుణ్ పిలుపు మేరకు రోడ్ల అద్వాన పరిస్థితులను తెలియజేస్తూ సింగనమల నియోజకవర్గం జనసేన పార్టీ అధ్వర్యంలో #GoodMorningCMSir డిజిటల్ క్యాంపెయిన్ భాగంగా 2వ రోజు బుక్కరాయసముద్రం మండలం నుండి సిద్ధరాంపురం మీదుగా పప్పూరు వరకు దాదాపు 20 కిలోమీటరల వరకు రోడ్డు అధ్వాన పరిస్థితిని తెలియజేయడం జరిగింది. వారం క్రితం ఇదే గుంతల్లో పడి రోడ్డు ప్రమాదంలో పెద్దన్న (24) మరణించడం జరిగింది. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం మేలుకొని రోడ్లు మరమ్మతులు చేయాలని జనసేనపార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి సాకే మురళీకృష్ణ, జిల్లా కార్యదర్శి చొప్ప చంద్ర, బుక్కరాయసముద్రం మండల అధ్యక్షలు జి. ఎర్రిస్వామి, కార్యనిర్వాహక సభ్యులు మనోహర్ మండల నాయకులు మునీంద్రా, పెద్దిరాజు, కుళ్ళయప్ప, తాహిర్, శ్రీనాథ్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.