నిద్రపోతున్న సీఎం గారు మేలుకోండి: గంజికుంట రామకృష్ణ, తుపాకుల భాస్కర్

అనంతపురం జిల్లా శింగణమల నియోజకవర్గం, నార్పలమండలం, రాష్ట్రములో రోడ్ల పై ఎక్కడ ఒక్క గుంత లేకుండా జులై 15 వతేది లోపు అన్ని మరమ్మతలు చేస్తామని ప్రగల్బాలు పలికిన ముఖ్యమంత్రి గారు నిద్ర నుండి మేల్కొనాలని, ఆంధ్రా ప్రదేశ్ రోడ్ల ఎంత ఆధ్వానంగా ఉన్నాయో ఒక్కసారి కళ్ళు తెరచి చూడాలని, జనసేన అధినేత పవన్కళ్యాణ్ పిలుపు తో గ్రామ, మండల, పంచాయితీల్లో గుంతలు తో ప్రమాదకరంగా ఉన్న రోడ్లు మరమ్మతు చెప్పట్టాలని కోరుతూ #గుడ్ మార్నింగ్ సియం సర్ అంటూ డిజిటల్ క్యాంపెనింగ్ కార్యక్రమాన్ని ఈ నెల 15 నుండి 17 వ తారీఖు వరకు చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమం లో భాగంగా మండలం లోని బండ్లపల్లి పప్పూరు గ్రామం, మూగేతిమ్మపల్లి, నడిమిపల్లి, గూగూడు గ్రామాల్లో గుంతలతో, కంకర తేలి ప్రమాదకరంగా ఉన్న రోడ్లను పరిశీలించడం జరిగింది. వినోదం నారాయణస్వామి మాట్లాడుతూ మూగేతిమ్మం పల్లి నుండి నార్పల తారు రోడ్డును వేయాలని, మండల కేంద్రానికి పిల్లలు స్కూల్ కి వెళ్ళడానికి ఎంతో ఇబ్బందులు పడుతున్నానన్నారు గూగూడు గ్రామా కాలనిలో మురుగు నీరు సరైన డ్రైనేజి లేక రోడ్లపై ప్రవహిస్తూ పిల్లలు, ముసలివాళ్ళు జారీ పడి ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. ఈ సమస్యని గూగూడు సచ్చివాలయ అధికారికి దృష్టికి తెచ్చిన ఫలితం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పథకాలపై పెట్టిన దృష్టి మౌలిక వసతుల పై పెడితే బాగుంటుందని లేదంటే జనసేన పార్టీ తరపున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వినోదం నారాయణస్వామి, పృద్వి రాజ్, శరత్, హరీష్, కార్తీక్, వినోదం లోకేష్, సాకే రాజు, బాబు, బడుగు రమణ, వినయ్ కుమార్, రవీంద్ర , అరవింద్, జగదీష్, మధు, ప్రవీణ్ , రవితేజ, నరేష్ , మల్లికార్జున దాసరి మహేష్, చెన్నకేశవులు, వినోదం రాకేష్ నార్పల జనసైనికులు పాల్గొన్నారు.