పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి: జనసేన వినతిపత్రం

పోలవరం మండలం, పట్టిసంలో గత మంగళవారంలో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 16 మంది రైతులకు సంబందించిన 40 ఎకరాల్లో పంట అగ్నికి ఆహుతి అయ్యింది. సంఘటనా స్థలాన్ని మండల అధ్యక్షులు చిన్ని ఆధ్వర్యంలో జనసేన పార్టీ పోలవరం నియోజకవర్గం ఇంచార్జి చిర్రి బాలరాజు, జిల్లా కార్యదర్శి పాదం కృష్ణ నాయకులు కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అన్నం పెట్టే అన్నదాతకి ఇంత కష్టం రావడం చాలా బాధాకరం అని, పొలంలో ఉండే వ్యవసాయ సామాగ్రి, కరెంటు వైర్లు, ధాన్యం అంతా కలిపి సుమారు 50 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని, రాత్రి పగలు కష్టించి అప్పు తెచ్చి సాగు చేసిన పంట కళ్ళముందు బూడిద అవుతుంటే ఎం చెయ్యలేని పరిస్థితి అని, పోలవరంలో అగ్నిమాపక కేంద్రం ఉంటే ఇలా జరిగేది కాదని, ఈ ఘటన జరిగి వారం అయినా ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోవడం బాధాకారం అని చిర్రి బాలరాజు మండిపడ్డారు. వారిని ప్రభుత్వమే ఆదుకోవాలి అని ఆయన డిమాండ్ చేసారు. చిర్రి బాలరాజు, నాయకులు, రైతులు అందరూ కలిసి పోలవరం తహసీల్దార్ గారిని కలిసి వినతి పత్రాన్ని అందజేసి పరిష్కారం చూపి రైతులను ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కె. నాగు, వీరమహిళ మామిడిపల్లి స్వాతి, మామిడిపల్లి ప్రసాద్, అనిశెట్టి రాధాయ్య, బాబి, తెలగంశెట్టి రాము, కూరసం రమేష్, కోటం లక్ష్మణ్, ఎస్.రామకృష్ణ, కరిబండి రాజు, బండి వెంకటేష్, కొక్కెర సత్తిబాబు, ఎం. సురేష్ పాల్గొన్నారు.