తక్షణమే ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం చెల్లించాలి

బొబ్బిలి నియోజకవర్గం, పారాది గ్రామంలో మిచౌంగ్ తుఫాన్ ప్రభావం వల్ల రైతులు అధికంగా నష్టపోయారు. ఈ సీజన్లో వరి పంట అధికంగా వేశారు. వరి చేతికొచ్చిన టైములో వరి చేను మొత్తం తడిసి ముద్దయింది. చివరికి రైతుకి కన్నీరు, కష్టమే మిగులుతుంది. బొబ్బిలి మండలం పారాది గ్రామంలో రైతులు ఎంతో కష్టపడి పెట్టుబడి పెట్టి వరి వేస్తే చివరికి పరిస్థితి ఇది. బొబ్బిలి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి కావున తక్షణమే ప్రభుత్వం స్పందించి వ్యవసాయ అధికారులను ఫీల్డ్ లో సర్వే చేసి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, తడిసిన పంట ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని మరియు బొబ్బిలి నియోజకవర్గంలో మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో పారాది ఎంపిటిసి అభ్యర్థి బంటుపల్లి దివ్య, పారాది జనసైనికులు బెల్లాన శ్రీనివాసరావు, పేకేటి సురేష్, బంటుపల్లి శంకర్, అల్లాడ తరుణ్, పున్నాన సతీష్, చిట్టి కార్తీక్, బెళ్లనా కార్తీక్, కోరాడ సంతోష్, యవరణ లక్ష్మి, లోకేష్, మధు, శేఖర్, వేణు, మురళి, హేమంత్, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.