నమ్మించి రైతులను మోసం చేసిన ప్రభుత్వం

• రాష్ట్రం గర్వపడే రాజధాని కావాల్సిన అమరావతి పాలకుల నిర్ణ యానికి బలయ్యింది
• ప్ర భుత్వ నిర్ణ యాలు ఆంధ్ర ప్ర దేశ్ ని రాజధాని లేని రాష్ట ్రంగా మార్చేశాయి
• రాష్ట్రా నికి అమరావతే రాజధాని… శ్రీ పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఒక్క అంగుళం కూడా కదపలేరు
• ఆరోగ్యం క్షీణించినా రై తులు… మహిళామణులు పాదయాత్ర కొనసాగిస్తు న్నారు
• రై తుల పాదయాత్ర కు జనసేన మద్దతు పలుకుతోంది
• వర్క్ ఫ్ర మ్ హోమ్ వదిలి ముఖ్యమంత్రి ప్ర జల్లో కి రావాలి
• రాజధాని రై తుల మహాపాదయాత్ర లో జనసేన పీఏసీ ైచర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్

రాజధాని కోసం జీవితాలను త్యాగం చేసి భూములు ఇచ్చిన రైతులను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. ప్రభుత్వం రైతులతో ఒప్పందం చేసుకున్న తరవాత వెనక్కిపోయినప్పుడు వారికి అండగా నిలబడాలని తెలిపారు. రైతులను మోసం చేసే విధంగా ప్రభుత్వాలు ప్రవర్తించకూడదన్నారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అంటూ అమరావతి నుంచి తిరుపతి వరకు రాజధాని రైతులు చేపట్టిన మహా పాదయాత్రలో శుక్రవారం ఉదయం నెల్లూరు జిల్లాలో శ్రీ మనోహర్ గారు పాల్గొన్నారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు, పీఏసీ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శులు, అసెంబ్లీ నియోజక వర్గాల ఇంచార్జులు, నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు, వీర మహిళలు వెంటరాగా కోవూరు తాలూకా సెంటర్ నుంచి బజార్ సెంటర్ వరకు రైతులతో కలసి నడిచారు. అనంతరం బజార్ సెంటర్ లో శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మీడియాతో మాట్లాడుతూ.. “రాష్ట్రం గర్వపడే రాజధాని కావాల్సిన అమరావతి వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి బలైంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు రైతులు చేస్తున్న పాదయాత్రను బలపర్చడానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. రాజధాని కోసం త్యాగాలు చేసి భూములు ఇచ్చిన రైతులను గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్న విషయాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు పదేపదే చెబుతూ ఉంటారు. బాధ్యత అంటే ప్రభుత్వం ఒక ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత వచ్చిన ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం రైతాంగానికి మేలు చేసే విధంగా ఉండాలి తప్ప ఆ రైతుల్ని మోసం చేసే విధంగా ఉండకూడదు.

• ప్రతి అడుగులో అసమర్థ పాలన
రాజధాని వ్యవహారాన్ని ఎవ్వరూ రాజకీయ కోణంలో చూడవద్దు. ముఖ్యమంత్రి గారు వర్క్ ఫ్రమ్ హోమ్ మాని ప్రజల్లోకి రావాలి. పాదయాత్రలు చేయాలి. అప్పుడే ప్రజల సమస్యలు తెలుస్తాయి. రాజధాని ప్రాంతం తాడేపల్లిలో ఉన్న ముఖ్యమంత్రి రెండు నిమిషాలు రైతులను, మహిళలను పిలిపించి మాట్లాడితే సమస్య ఇంత జఠిలం అయ్యేది కాదు. ఒక ముఖ్యమంత్రిగా వారికి భరోసా కల్పించాలి. దాన్ని మీరు విస్మరించారు. ప్రతి అడుగులో అసమర్థ పాలన సాగుతోంది. పరిపాలనపై పట్టు లేదు. ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూసి ప్రతి ఒక్కరినీ అవమానిస్తున్నారు. ప్రభుత్వం కొంచమైనా అభివృద్ధి చేసి ఉంటే చక్కటి రాజధాని మనకు ఉండేది. ఈ ప్రభుత్వ నిర్ణయాల కారణంగా రాజధాని లేని రాష్ట్రంగా మనం మిగిలిపోయాం. రాజధాని వ్యవహారంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్రానికి అమరావతే రాజధాని. ఇందులో సందేహం లేదు. భూములు ఇచ్చిన రైతుల్లో ఎక్కువ మంది అర ఎకరా, ఎకరా ఇచ్చిన చిన్నచిన్న రైతులే ఉన్నారు. ఈ వ్యవహారంలో దుష్ప్రచారం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా చిచ్చు పెడుతూ శ్రీ జగన్ రెడ్డి గారు కాలం గడిపారు. ముందు సమస్య ఏంటో అర్ధం చేసుకోండి. 29 వేల మంది రైతులు భూములు ఇస్తే 25 వేల మంది రెండు ఎకరాల లోపు ఉన్నవాళ్లు ఉన్నారు. వారిని రకరకాలుగా అవమానించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు అనీ, భూములు ఉన్నాయని రకరకాలుగా కథనాలు రాయించి అవమానకరంగా ప్రవర్తించడం బాధాకరం.

• రాజధాని రైతుల పోరాటం న్యాయబద్ధమైనది
ముఖ్యమంత్రి వర్క్ ఫ్రమ్ హోమ్ మాని ప్రజల దగ్గరకు వెళ్లి పాలించాలి. ప్రజల్లో ఉన్న సమస్యలు తెలుసుకోండి. అమరావతి రైతుల పాదయాత్రకు అడుగడుగునా ఎందుకు ఇంత ఆదరణ దొరుకుతుందనే విషయం తెలుసుకోండి. రాజధాని వ్యవహారంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ మొదటి నుంచి ఒకటే నిర్ణయానికి కట్టుబడి ఉంది. రాజధాని రైతుల పోరాటం న్యాయబద్దమైనది.. నిజాయితీగా వారి పక్షాన నిలబడాలన్నదే శ్రీ పవన్ కల్యాణ్ గారి మాట. ఓట్ల కోసం కాకుండా రైతాంగానికి మద్దతు పలకడం కోసం ఈ రోజు పాదయాత్రలో పాల్గొంటున్నాం. ఆరోగ్యం క్షీణించినప్పటికీ రైతులు, మహిళలు కష్టపడి పాదయాత్ర చేస్తున్నారు. భగవంతుడు వారిని కాపాడాలి. అన్ని విధాలా ఆరోగ్యం ప్రసాదించాలి. అమరావతే రాజధానిగా ఉండాలన్న నిర్ణయానికి జనసేన పార్టీ కట్టుబడి ఉంది. ప్రజలంతా రైతుల పాదయాత్రను బలపర్చాలి. అమరావతే మనకు రాజధాని. శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా ఒక్క అంగుళం కూడా ఇక్కడి నుంచి కదలకుండా పోరాటం చేద్దాం. భవిష్యత్తులో రాష్ట్రానికి మంచి జరగాలి. మంచి పరిపాలన రావాలని కోరుకుందాం” అన్నారు.

• పాదయాత్ర సాగిందిలా…
రాజధాని రైతుల మహాపాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు నెల్లూరు చేరుకున్న శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి స్థానిక పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. వీర మహిళలు హారతులు పట్టి ఆయనకు ఆహ్వానం పలికారు. జనసైనికులు పూల వర్షం కురిపించారు. అనంతరం అక్కడి నుంచి వందలాది బైకులు, కార్లతో భారీ ర్యాలీగా మహాపాదయాత్ర సాగుతున్న కోవూరుకు వెళ్లారు. కోవూరు తాలూకా సెంటర్ వద్ద పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులతో కలసి పాదయాత్ర చేస్తున్న రైతులను, మహిళలను కలిశారు. శ్రీ మనోహర్ గారిని రాజధాని రైతులు, మహిళలు, అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు సాదరంగా ఆహ్వానించారు. మహాపాదయాత్ర రథంలో శ్రీ వెంకటేశ్వరస్వామికి పూజలు చేసి అడుగు ముందుకు వేశారు. రైతులతో కలసి కోవూరు బజార్ సెంటర్ వరకు సుమారు రెండు కి.మీ.` మేర శ్రీ మనోహర్ గారు నడిచారు. పాదయాత్ర ఆద్యంతం జై అమరావతి, జై జనసేన నినాదాలతో మారుమ్రోగింది. అన్ని జిల్లా నుంచి తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాదయాత్రలో నడిచారు. అంతకు ముందు తిరుపతి నుంచి బయలుదేరిన శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి దారి పొడవునా ఘనస్వాగతం లభించిది. శ్రీకాళహస్తి, నాయుడుపేట, గూడూరుల్లో పార్టీ శ్రేణులు పూలదండలుతో ముంచెత్తారు. మనుబోలు మండల జనసైనికులు శ్రీ మనోహర్ గారి చేతుల మీదుగా రైతులకు ఉచితంగా యూరియా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు