అమరావతి రైతుల డిమాండ్‌కు గవర్నర్‌ సహకరించాలి

జగన్‌ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పాలన వికేంద్రీకరణ కేవలం సొంత ప్రయోజనాల కోసం తప్ప రైతుల సంక్షేమానికి ఏమాత్రం ఉపయోగపడదని… మూడు  రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులను  తిరస్కరించి వారికి సహకరించాలoటూ రాజధాని రైతులు గవర్నర్‌ను డిమాండ్‌ చేశారు. ఏకైక రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలని రైతులు చేస్తున్న ఆందోళనలు ప్రారంభమయ్యి సోమవారానికి 216 రోజులు పూర్తి. ఈ సందర్భంగా రైతులు, రైతుకూలీలు, మహిళలు మాట్లాడుతూ… ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నపుడు రాజధాని అమరావతికి ఆమోదం తెలిపిన జగన్ అధికారంలోకి వచ్చాక వ్యతిరేకిస్తున్నారన్నారు. ఐదు కోట్ల మంది తిరస్కరిoచిన మూడు రాజధానుల ప్రతిపాదనను జగన్‌ మాత్రం మొండిగా ముందుకు వెళ్ళడాన్ని అమరావతి రైతులు తప్పు పట్టారు.   అన్నం పెట్టే 33 వేల ఎకరాల సాగు భూమిని త్యాగం చేసిన రైతులను అడ్డంగా ముంచుతారా…? అని ఆవేదనతో భావోద్వేగానికి గురయ్యారు.