సాతంబాకం బ్రిడ్జిపై ఏర్పడిన రంధ్రాన్ని పూడ్చాలి!

గంగాధర నెల్లూరు నియోజకవర్గం: పెనుమూరు మండల కేంద్రం నుండి చిత్తూరుకి వెళ్లే రహదారిలో, సాతంబాకం వద్ద చెరువుకి అనుసంధానంగా ఉన్న బ్రిడ్జి, పెద్ద రంధ్రం ఏర్పడి ప్రమాదకర పరిస్థితిలో ఉండి రహదారిలో ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారింది. ఈ సమస్యపై రోడ్లు భవనాల శాఖ అధికారులు వెంటనే స్పందించాలని జనసేన ఇన్చార్జి డాక్టర్ యుగంధర్ పొన్న తెలుపుతూ ఉపముఖ్యమంత్రి ఇలాకాలో పడిన రంధ్రాన్ని పూడ్చేదెవరు?.. ఈ సమస్యను సరి చేసేది ఎవరు? అని ప్రశ్నిస్తూ ఒక వారంలో సమస్యను పరిష్కరించకపోతే జనసేన పార్టీ ఆధ్వర్యంలో పరిష్కారం చూపించగలమని తెలిపారు.