ఒక్క జగనన్న కాలనీ పూర్తి అయినది కానీ జనావాసాలకు అనువుగా ఉన్న కాలనీ గాని చూపించండి

  • జిల్లా అధికార ప్రతినిధి సాకే మురళీకృష్ణ

సింగనమల, జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు అనే కార్యక్రమంలో భాగంగా గత మూడు రోజుల నుంచి జనసేన పార్టీ ఆధ్వర్యంలో జగనన్న కాలనీలో దుస్థితిని ప్రజలకు తెలియజేసినందువలన వైసీపీ నాయకులు ఓర్చుకోలేక అవాకులు చవాకులు పేలుతున్నారు వైసీపీ నాయకులకు జనసేన పార్టీ తరఫున ఒక సవాల్ విసురుతున్నాం సింగనమల నియోజకవర్గంలో ఎక్కడికైనా సరే జనసేన పార్టీ తరఫున మేము వస్తాము వైసీపీ పార్టీ తరఫున వైసిపి పార్టీ నాయకులు ఎవరైనా సరే నియోజకవర్గంలో ఒక కాలనీ పూర్తయినది కానీ జనావాసాలకు అణువుగా ఇచ్చిన స్థలాన్ని చూపించగలరా ముఖ్యంగా బుక్కరాయసముద్రం మండలంలో 19 పంచాయతీల గాను 36 గ్రామాలలో ఒక్క బుక్కరాయ సముద్రము అమ్మవారిపేట గ్రామాల్లో కొన్ని పునాదులు మాత్రమే వేశారు. డబ్బులు ఉన్నవారు సొంత నిధులతో గృహాలు కట్టించుకుంటున్నారు. మరి మిగతా 34 గ్రామాలలో ఒక్క పునాది అయినా చూపించగలరా బుక్కరాయసముద్రం మండలంలో మీరు ఎంపిక చేసిన 600 మంది లబ్ధిదారులను ఎందుకు మీరు ఇచ్చిన పట్టాలను రద్దు చేశారు. ఎప్పుడు చూసినా వైసిపి నాయకులు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒకటే అంటున్నారు ఇప్పుడు అధికారంలో ఉన్న మీరు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు అవినీతి పై పుస్తకాలు వేశారు కదా మరి వాటిని నిరూపించి చంద్రబాబును తెలుగుదేశం పార్టీ నాయకులను జైలుకు పంపవచ్చు కదా మరి మీరు ఎందుకు పంపడం లేదు దీనిని బట్టి అర్థమవుతుంది ఎవరు ఎవరికి అండగా ఉంటున్నారు ఎవరు ప్రజల మనిషి అన్నది మీరు చెప్పే అభివృద్ధి ఎక్కడ ఉంది ఏ గ్రామంలో ఉందో చూపిస్తారా కనీసం గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే రహదారులు కూడా సరిగ్గా లేవు బుక్కరాయసముద్రం జడ్పిటిసి సొంత గ్రామమైన పసులూరు గ్రామంలో ఎన్ని జగనన్న ఇల్లు కంప్లీట్ అయ్యాయో మరియు ఎంతమందికి బినామీలకి ఇచ్చారో రికార్డులు బయట పెట్టగలరా జగనన్న కాలనీల యొక్క అవినీతిని జనసేన పార్టీ బయటపెడుతోందని అక్కసుతో జనసేన పార్టీ మీద వైసిపి నాయకులు లేనిపోని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు జగనన్న కాలనీలో మొదటి పేజ్ లో రాష్ట్రవ్యాప్తంగా 15.10 లక్షల గృహాలు నిర్మిస్తామన్నారు మరి వాటిలో కనీసం పదివేల గృహాలైన నిర్మించారా అలాగే రాష్ట్రవ్యాప్తంగా 15 వేల కాలనీలు అన్నారు కనీసం ఐదు కాలనీలైన పూర్తి చేశారా. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ప్రజలలో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక అధికారం పోతుందనే బాధలో ఇలా మాట్లాడుతున్నారు.