స్పందన కార్యక్రమంలో కలెక్టర్ కి వినతిపత్రం అందజేసిన జనసేన నాయకులు

  • పంచాయితీ నిధులు సొంత ఖాతాలోకి బదిలీ చేసిన సర్పంచ్ తాటిపర్తి వనజ.
  • కాసులకి కకుర్తి పడి ప్రభుత్వ నిధులు స్వహా చేస్తున్న పంచాయితీ రాజ్ జె.ఇ.శ్రీహరి.

కొండేపి, సింగరాయకొండ గ్రామపంచాయతీ 14వ సంవత్సరం 15వ సంవత్సర పంచాయతీ నిధులను సర్పంచ్ తాటిపర్తి వనజ సొంత అకౌంట్ కు బదిలీ చేసుకోవడం జరిగినది. సుమారు 35 లక్షలు సర్పంచ్ సొంత అకౌంట్ కి బదిలీ చేసి అవినీతికి పాల్పడినటువంటి సర్పంచ్ వనజకి చెక్ పవర్ రద్దు చేసి, జరిగిన అవినీతి సొమ్మును రికవరీ చేయవలెనని సోమవారం స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కి అర్జీ ఇవ్వటం జరిగినది. గతంలో సింగరాయకొండ గ్రామ పంచాయతీలో మారుతీ కార్యదర్శిగా పనిచేసి అవినీతికి పాల్పడినప్పటికి, మారుతీ పాత సింగరాయకొండ కార్యదర్శిగా మళ్లీ ఉద్యోగం ఇవ్వటం వలనే, ఇటువంటి అవినీతి ఉద్యోగులు ఎక్కువవుతున్నారు. కనుక జిల్లా కలెక్టర్ గత కార్యదర్శిగా పనిచేసిన ప్రస్తుత కార్యదర్శిగా పాత సింగరాయకొండ నందు విధులు నిర్వర్తిస్తున్న మారుతిపై జిల్లా కలెక్టర్ గాని జాయింట్ కలెక్టర్ గాని పర్యవేక్షణలో రికార్డులు తనిఖీ చేసి వారిపై తగు చర్యలు తీసుకొని విధుల నుండి సస్పెండ్ చేసి మరల ఎటువంటి ప్రభుత్వ అధికారులు తప్పు చేయకుండా ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు చేపట్టవలెనని జిల్లా కలెక్టర్ కి జనసేన పార్టీ నుండి అర్జీ ఇవ్వటం జరిగినది. మరియు సింగరాయకొండ మండలం మూలగుంటపాడు గ్రామపంచాయతీ పరిధిలో స్వర్ణ వెంకటేశ్వర్లలో ఇంటి వద్ద నుండి రేగులగుంటకు పోవు వాగును ఆక్రమణకు గురై ఉన్నది. కానీ ఎటువంటి ఆక్రమణ తొలగించకుండా కాలువ వైశాల్యం తగ్గించి హెచ్చుతగ్గులుగా వేస్తూ కనీసం మూలగుంటపాడు గ్రామపంచాయతీ పరిధిలో పొడవు వెడల్పులు ఎంత అని తీర్మానించాకుండానే జే.ఇ. శ్రీహరి కమిషన్ల కోసం కక్కుర్తిపడి అనుభవంలేని కాంట్రాక్టర్ కి ఇవటం జరుగుతుంది. ఎవరికి పడితే వాళ్లకి కాలవలు వేయమని ఇచ్చి కాసులు దండుకునే పనిలో ఉన్న జె.ఇ.శ్రీహరి. ప్రతి గవర్నమెంటు అధికారి సుమారు మూడు లేదా ఐదు సంవత్సరాలకు ట్రాన్స్ఫర్ అయ్యి ఇతర ఇతర ప్రదేశంలో విధులు నిర్వర్తించే పద్దతి ఉంటుంది. కానీ పదిహేను సంవత్సరాల పైబడి నుండి సింగరాయకొండ పంచాయతీరాజ్ జె.ఇ.గా విధులు నిర్వర్తిస్తున్నారు. అంటే పై అధికారులతో లాలూచీపడి అవినీతి కి పాల్పడే జె.ఇ. శ్రీహరిపై వెంటనే తగిన చర్యలు తీసుకొని, వీధుల నుండి తొలగించవలెను అని ములగుంట గ్రామ ప్రజల తరుపున జనసేన నాయకులు స్పందన కార్యక్రమంలో కలెక్టర్ కి వినతిపత్రం అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్, జరుగుమల్లి మండల అధ్యక్షులు గూడా శశిభుషన్, జనసేన నాయకులు కాసుల శ్రీనివాస్, సయ్యద్ చాన్ బాషా, సంకే నాగరాజు, అనుమలశెట్టి కిరణ్ బాబు, జనసైనికులు మరియు వీర మహిళలు పాల్గొన్నారు.