Nellore: సమస్యలపై పోరాటమే లక్ష్యంగా జనసేన పార్టీ ప్రచారం

జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ గారి నాయకత్వంలో నెల్లూరు నగరం16వ డివిజన్ లో శివాలయం వద్ద నుంచి సాయిబాబా మందిరం వరకు లాంఛనంగా ప్రారంభమైన ఎలక్షన్ క్యాంపెయిన్ లో పాల్గొన్న జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల గారు నెల్లూరు నగర నాయకులు సుజయ్ బాబు గారు, రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు గారు,స్థానిక నాయకులు sk సాయిబాబా భరత్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ మాట్లాడుతూ… సమస్యలతో సతమతమవుతున్న సింహపురి ప్రజలకు సంక్షేమమే లక్ష్యంగా… జనసేన పార్టీ రానున్న స్థానిక ఎన్నికలలో అభ్యర్థుల తో తలబడుతుంది… సమాజం ప్రత్యామ్నాయం కోరుకుంటుంది… ఆ మార్పులో భాగంగా జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు అందరూ ఆశీర్వదించ వలసిందిగా ప్రార్ధిస్తూ ఈరోజు జనసేన తరపున ప్రచార కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. డివిజన్లో మీకు అందుబాటులో ఉండే జనసేన జనసైనికులు పోటీ చేయనున్నారు. స్థానిక సమస్యలపై ఇప్పటి వరకు ప్రశ్నించిన జనసేన ఇపుడు స్థానిక నాయకత్వాన్ని కోరుకుంటుంది ప్రజలందరూ దీవించి ఎవరి ఆధీనం లో లేని మా నాయకులకు ఓట్లు వేసి బ్రతుకు భారం చేస్తున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పవలసినది గా కోరుతున్నాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.