జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలి

హైదరాబాద్: జూబ్లీహిల్స్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్, పార్టీ ముఖ్య నాయకులు రామ్ తాళ్లూరి, పొలిట్ బ్యూరో సభ్యులు హర్హం ఖాన్, జి.హెచ్.ఎం.సీ అధ్యక్షులు రాదారం రాజలింగం ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇన్చార్జిలతో సోమవారం సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశంలో భాగంగా ఇన్చార్జిలుగా ఉన్న నియోజకవర్గంలో ప్రతి ఇంటింటికీ క్షేత్రస్థాయిలో పార్టీని ముందుకు తీసుకెళ్లాలని ఇన్చార్జ్ లకు సూచన, సలహాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పర్యవేక్షణ సభ్యులు, నియోజకవర్గాల ఇన్చార్జులు పాల్గొన్నారు.