చేనేత కుటుంబానికి న్యాయం జరిగే వరకూ జనసేన పార్టీ పోరాటం చేస్తుంది

  • కడప జిల్లాలో బలవన్మరణానికి పాల్పడ్డ చేనేత కుటుంబానికి న్యాయం జరిగే వరకూ జనసేన పార్టీ పోరాటం చేస్తుంది
  • రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టివేసిన వైసిపి ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు
  • మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి కొరకు రానున్న ఎన్నికల్లో నారా లోకేష్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి
  • జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం చైర్మన్ మరియు మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు

మంగళగిరి: జనసేన పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ కడప జిల్లాలో బలవన్మరణానికి మరణానికి పాల్పడ్డ చేనేత కుటుంబానికి వైసీపీ ప్రభుత్వం బాధ్యత వహిస్తూ ఆ కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వైసిపి ప్రభుత్వ పాలనలో రైతులకు చేనేతలకు కార్మికులకు తీరని అన్యాయం జరిగిందని ఆగ్రహ వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జనసేన టిడిపి సమన్వయంతో పని చేస్తుందని సోషల్ మీడియాలో వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మరని తేల్చి చెప్పారు. సీఎం అయిన పి యం అయినా ఎన్నికల కోడ్ ప్రతి ఒక్కరికి వర్తిస్తుందని ఎన్నికల కోడ్ ఉల్లంఘించకుండా నారా లోకేష్ పోలీసుల తనిఖీలకు సహకరించడాన్ని వైసీపీ సోషల్ మీడియా తప్పు పట్టటం ఏంటి అని ప్రశ్నించారు. ఆనాడు చంద్రబాబు నాయుడు ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయటం వల్ల విదేశాలలో మనవాళ్లు ఉన్నతమైన స్థానాలలో ఉన్నారని తెలియజేశారు. రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి కోసం
జనసేన టిడిపి బిజెపి ఉమ్మడిగా నియమించిన అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ చేనేత వికాస విభాగం రాష్ట్ర కార్యదర్శి జంజనం వెంకట సాంబశివరావు (జె ఎస్ ఆర్), గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, ఎంటిఎంసీ అధ్యక్షులు మునగపాటి వెంకట మారుతిరావు, ఎంటిఎంసీ ఉపాధ్యక్షులు సాధు చంద్రశేఖర్, తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరావు (ఎస్ ఎన్ ఆర్), పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.