బోర్డు తిప్పేసిన ప్రముఖ యానిమేషన్‌ కంపెనీ

నగరంలో ప్రముఖ యానిమేషన్‌ కంపెనీ డిక్యు ఎంటటైన్మెంట్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ కంపెనీ బోర్డు తిప్పేసింది. కంపెనీ దివాలా తీసిందని ట్రిబ్యునల్‌లో డీక్యూ కంపెనీ పిటిషన్‌ దాఖలు చేసింది. దీంతో 1400 మంది డీక్యూ కంపెనీ ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఎనిమిది నెలలుగా ఉద్యోగులకు డీక్యూ యాజమాన్యం జీతాలు ఇవ్వడం లేదు. న్యాయం చేయాలంటూ ఉద్యోగులు హెచ్‌ఆర్సీని ఆశ్రయించారు. ఎంపీ తపాస్ చక్రవర్తిపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. ఒక్కొక్కరికి రూ.14 లక్షల చొప్పున బకాయిలున్నట్టు ఉద్యోగలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ తపాస్ చక్రవర్తిపై బంజారాహిల్స్‌ పీఎస్‌లో ఉద్యోగులు ఫిర్యాదు చేశారు.