కార్మికుల న్యాయబద్ధమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలి

పారిశుధ్య కార్మికుల సమస్యలపై పోరాటాలలో జనసేన పార్టీ ముందుంటుంది: నగర అధ్యక్షుడు నేరెళ్ల

గుంటురు, పారిశుధ్య కార్మికుల అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని అన్ని కార్మిక సంఘాలు సోమవారం నుండి విధులు బహిష్కరించి సమ్మె చేయడం జరిగింది. న్యాయమైన పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్లను, అభ్యర్ధనలను పటించుకోని ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ జనసేనపార్టీ గుంటూరు నగర అధ్యక్షులు నెరేళ్ల సురేష్ సమ్మెలో పాల్గొని సోమి ఉదయ్ నేతృత్వంలో జరుగిన కార్మిక సంఘాలకి సంఘీభావం తెలియజేసారు. నెరేళ్ల సురేష్ మాట్లాడుతూ… గుంటూరులో పారిశుధ్యం పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది ఇలాంటి పరిస్థితుల్లో కార్మికుల సమ్మె ప్రజలను మరింత ఇబ్బందులకు గురిచేస్తుంది. కావున జగన్ మోహన్ రెడ్డి కార్మికుల న్యాయబద్ధమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలి. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వలన గుంటూరు నగరంలో దాదాపు 1500 పైచిలుకు కార్మిక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారు అన్నారు. మరియు ఔట్ సోర్సింగ్ కార్మికులకు ఎటువంటి ప్రభుత్వ పథకాలు రాకుండా ఉండటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.
ప్రభుత్వం దిగివచ్చి డిమాండ్లను నేరవేర్చని పక్షంలో సమ్మెను ఉధృతం చేస్తామని చెప్పారు.
కార్మికుల డిమాండ్లు:

  1. ఔట్ సోర్సింగ్ కార్మికులను క్రమబద్దీకరించాలి
  2. పెండింగ్ లో ఉన్న వేతనాలను వెంటనే హెల్లించాలి.
  3. 6 నెలలుగా పెండింగ్లో ఉన్న మెడికల్ అలవెన్స్లు వెంటనే చెలించాలి.
  4. పనికి తగిన గౌరవ వేతనం చెలించాలి.
  5. పని భారాన్ని 8 గం౹౹లకు తగించాలి.
  6. అన్ని ప్రభుత్వ పధకాలను ఔట్ సోర్సింగ్ కార్మికులకు కూడా వర్తించే విధంగా చూడాలి.
  7. వార్డు సచివాలయలు మాకు వద్దు.
    ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్పొరేటర్లు శ్రీమతి ఎర్రంశెట్టి పద్మావతి, దాసరి లక్ష్మీ దుర్గ మరియు జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ల హారి మరియు నగర కమిటీ సభ్యులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.