పాలన చేతకాక రంగుల పిచ్చి: దివ్యవాణి

పాలన చేతకాని జగన్మోహన్‌రెడ్డికి రంగుల పిచ్చి పట్టుకుందని టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి విమర్శించారు. మీడియాతో ఆమె మాట్లాడారు. ‘పోలీసు వాహనాలకు కూడా పార్టీ రంగులు వేయడం ఎంత వరకు సమంజసం? అని ప్రశ్నించారు. రంగు పిచ్చి ముదిరి మొహాలకు కూడా రాసుకుని రోడ్ల మీద తిరిగేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. పోలీసులకు ఇచ్చిన బైకులు ప్రభుత్వానివా లేక పులివెందుల పంచాయతీ నుంచి తీసుకొచ్చిన సొంతవా? అని విమర్శించారు. రంగులు వేయడానికి తీయడానికి రూ.4 వేల కోట్ల ప్రజా ధనాన్ని వృధా చేశారని 18 నెలల కాలంలో ప్రజలపై రూ.2 లక్షల కోట్ల భారాన్ని ప్రజలపై వేసి జలగలా రక్తాన్ని తాగుతున్నారని ఆరోపించారు. సెంటు పట్టా పేరుతో రూ.4 వేల కోట్లు మింగారు’ అంటూ ప్రభుత్వంపై దివ్యవాణి ధ్వజమెత్తారు.