ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన ఎమ్మెల్యే – చోద్యం చూసిన పోలీసులు

  • తాతంశెట్టి నాగేంద్ర, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి

రైల్వే కోడూరు, శనివారం జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర మాట్లాడుతూ సాక్షాత్తూ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడి పరిరక్షింపవలసిన ప్రజా ప్రతినిధి ఎమ్మెల్యే మరియు విప్ గా ఉన్న కొరముట్ల శ్రీనివాసులు 23/02/23 వ తారీఖు సాయంత్రము రైల్వే కోడూరులోని ప్రధాన హైవే రోడ్డు మీద ఎలాంటి అనుమతులు లేకుండా ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కివందలాది మంది తన అనుచరులు, వైసీపీ పార్టీ కార్యకర్తలతో ధర్నా నిర్వహించి ప్రజలకు అసౌకర్యాన్ని కలిగించి, ప్రజా జీవితాన్ని అడ్డుకుని ప్రజల హక్కులను కాల రాసే విధంగా నడిరోడ్డులో నిరసన కార్యక్రమం నిర్వహించడం హేయమైన చర్య అని నాగేంద్ర ఖండిచారు. ఈ నెల 9/02/23 నుండి ఎమ్మెల్సి ఎన్నికల నియమావళి అమలులో ఉన్నా పత్రికలను నడి రోడ్డులో కాల్చి, శవయాత్ర నిర్వహించి ప్రజలను భయ భ్రాంతులకు గురి చేయడం తగదన్నారు. ఇంత జరుగుతున్నా అడ్డుకోవాల్సిన పోలీసులు అడ్డుకోగ పోగా వాళ్లకు సహకరిస్తూ చోద్యం చూసారని తెలియ జేశారు ఈ విషయంపై ఎమ్మెల్యే మీద కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు మరియు ఎమ్మెల్సి ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశామన్నారు. కనీసం ఎలాంటి చర్యలు తీసుకోకుండా, సహకరించిన పోలీసు అధికారి మరియు ఇతర అధికారుల మీద జిల్లా ఎస్పీ, కలెక్టర్, డీజీపీ మరియు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. నియమావళి ఉల్లంఘించిన ఎమ్మెల్యే పైన, సహకరించిన సీఐపై చర్యలు తీసుకుని ప్రజాస్వామ్యాన్ని పరి రక్షించాలని అధికారులను కోరామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కారుమంచి సంయుక్త, గంథంశెట్టి దినకర్ బాబు, పగడాల వెంకటేష్, వరికూటి నాగరాజ, ఉత్తరాది శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.