కలెక్టరేట్ ను ముట్టడించిన జనసైనికులు

*జనసైనికులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించిన పోలీసులు

పార్వతీపురం, కొన్ని రోజుల ముందు కోమరడా మండలంలో ప్రజలకు అందవలసిన ఇసుకను ఇసుక మాఫియా దోచుకుంటుందని గతంలో అధికారులు దృష్టికి తీసుకువెళ్లిన అధికారులు స్పందించకపోవడంతో నేడు పార్వతీపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కురుపాం జనసేన నాయకులు కార్యకర్తలు నల్లని రిబ్బన్ తో నిరసన కార్యక్రమం చెయ్యడంతో పోలీస్ వారు అరెస్ట్ చెయ్యడం జరిగింది. పోలీసులు జనసైనికులు మధ్య జరిగిన తోపులాటలో జనసైనికుడు అల్లు రమేష్ కు తీవ్ర రక్త స్రావం అవ్వడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

బాబు పాలూరు మాట్లాడుతూ… ఈ అక్రమ అరెస్టులతో మమ్మల్ని ఆపలేరు. కొత్త జిల్లా ఏర్పడిన నుంచి ఈరోజు వరకు కలెక్టర్ ప్రజల మధ్యకు ఎందుకు రాలేకపోతున్నారు? ఫోటో స్టిల్స్ మీడియా హంగామా తప్ప మీరు ఏమి చేశారని ప్రశ్నించారు. సమస్యకు పరిష్కారం చూపించాల్సిన కలెక్టర్ పోలీసులను అడ్డుపెట్టుకొని మా నిరసనను అడ్డుకోవడం సిగ్గుచేటని, పార్వతీపురం పట్టణంలో యథేచ్ఛగా నాటుసారా విక్రయాలు జరుగుతుంటే ఇక్కడ వదిలేసి ఏజెన్సీలో ఎక్కడో అన్ని లీటర్లు ఇన్ని లీటర్లు దాడి చేసాము తూతూమంత్రంగా చేస్తున్నారు. పోలీసులు తీరు మార్చుకోవాలని తక్షణమే మీరు చిత్తశుద్ధితో అక్రమ ఇసుక మాఫియాను అడ్డుకోవాలి లేని ఎడల ఇది తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.