జనసేన పార్టీ తెలంగాణ ఇంచార్జ్ శంకర్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన దళిత సోదర సంఘం జాతీయ అధ్యక్షులు

హైదరాబాద్, జనసేన పార్టీని తెలంగాణలో బలోపేతం చేసేందుకు జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సేవభావాలకు ప్రభావితులైన దళిత సోదర సంఘం జాతీయ అధ్యక్షులు దళిత రాజు మరియు వారి బృందం జనసేన పార్టీ తెలంగాణ ఇంచార్జ్ శంకర్ గౌడ్ ని కలిసిన చర్చించిన అనంతరం దళిత సోదర సంఘం నుండి 5000 దళిత సోదరులు జనసేన పార్టీలో చేరేందుకు నిశ్చయించుకున్నారు. త్వరలో దళిత సోదర సంఘంతో జనసేన తెలంగాణ రాష్ట్ర నాయకులు భారీ సమావేశం నిర్వహించాలని కోరారు. ఈ సమావేశం కోసం తెలంగాణ రాష్ట్ర యువజన కార్యదర్శి మూల హరీష్ గౌడ్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నబాద్ నియోజకవర్గం నాయకులు చిట్టి ఉదయ్ భాస్కర్ రెడ్డి, జగిత్యాల నియోజకవర్గం నాయకులు జనార్ధన్ కొన్ని రోజుల కృషితో ఈ కార్యచరణ జరిగిందని తెలిపారు.