ప్రజల పట్ల సానుభూతి ఉంటే ప్రజలకు న్యాయం చెయ్యండి

కురుపాం నియోజకవర్గం, జియ్యమ్మవలస మండలం అలమండ పంచాయితీలో చిన్నతోలమండ గ్రామం మంచి నీటి సదుపాయం లేక అలానే ఆ గ్రామం వెళ్లుటకు రోడ్డు సదుపాయం లేక పిల్లలు చదువుకోడానికి స్కూల్ బిల్డింగ్ లేక ఒక పూరిపాకలో సుమారు 70 మంది పిల్లలకు చాలా సంవత్సరాల నుంచి అందులో చదువు చెప్తున్నట్లు ఆ గ్రామానికి ఇంటింటా రేషన్ సరుకులు వాళ్ళ ఊరిలోకి వెళ్ళటం లేదు వాళ్ళు సుమారు 2 కిలోమీటర్లు నడిచి వచ్చి అక్కడ తీసుకొని ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి అని చింతోలు మండ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చి మూడేళ్లు గడిచినా స్థానిక ఎమ్మెల్యే ఆ గ్రామానికి ఎటువంటి అభివృద్ధి చెయ్యలేదని జనసేన పార్టీ నాయకులకు నేరుడుబిల్లి వంశీ, రాజేష్, రంజిత్, భార్గవ్ తెలియపరిచారు. దీని మీద ఆ గ్రామానికి సంబంధించిన పనులన్నిటినీ ఇప్పటికైనా శ్రద్ధవహించి స్థానిక ఎమ్మెల్యే కళ్ళు తెరిచి కురుపాం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఇదే పరిస్థి కనిపిస్తుంది కాబట్టి మీకు ప్రజల పట్ల సానుభూతి ఉంటే మీరు ప్రజలకు న్యాయం చెయ్యండి, లేకుంటే కురుపాం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు మీ అసమర్థ పాలనని తీవ్రంగా కండిస్తున్నాం అని తెలిపారు.