ప్రజా సేవలో తరించడమే జనసేన ముందున్న లక్ష్యం

  • పవన్ కళ్యాణ్ మాకు స్ఫూర్తి.
  • ఆర్తనాదాలు వినపడని సమాజం కోసమే మా కృషి.
  • జనసేన ఇంచార్జి డా.యుగంధర్ పొన్న

గంగాధర నెల్లూరు, వెదురు కుప్పం మండలం, మొండి వెంగనపల్లి పంచాయతీ, కాపు మొండి వెంగనపల్లి గ్రామ నిరుపేద చిన్న నాగయ్య ను జనసేన పార్టీ నియోజకవర్గం ఇంచార్జి డా.యుగంధర్ పొన్న పరామర్శించారు. ఈ సందర్బంగా డా.యుగంధర్ పొన్న మాట్లాడుతూ… ప్రజా సేవలో తరించడమే జనసేన పార్టీ ముందున్న లక్ష్యమని, ఎక్కడ కష్టాలు ఉంటాయో, ఎక్కడ భాదలు ఉంటాయో, ఎక్కడ కన్నీళ్లు ఉంటాయో, ఎక్కడ వేదనలు ఉంటాయో అక్కడ జనసేన ఉంటుందని తెలిపారు. ఎందరో త్యాగధనుల అడుగు జాడల్లో పయనిస్తున్న పవన్ కళ్యాణ్ మాకు స్ఫూర్తి అని కొనియాడారు. ఈ సందర్బంగా చిన్న నాగయ్య కు బియ్యం, వంట సరుకులు, కాయగూరలు పంపిణి చేశారు. చిన్న నాగయ్యకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు మంజూరు చేయాలనీ అధికారులను డిమాండ్ చేశారు. ఇళ్ళులేని నిరుపేదకు అన్ని విధాలా ప్రభుత్వం సహాయం ఆంచించాలని కోరారు. జనసేన తరపున మా వంతు సహకారం ఎల్లపుడూ ఉంటుందని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పురుషోత్తం, సీనియర్ నాయకులు యతీశ్వర్ రెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్సులు వెంకటేష్, రాఘవ, ప్రధాన కార్యదర్సులు కిరణ్, సతీష్, గుణశేఖర్, కార్యదర్శి మహేష్, సంయుక్త కార్యదర్శి సాయి కృష్ణ, జనసేన నాయకులు అజిత్, కార్వేటినగరం మండల ప్రధాన కార్యదర్శి వెంకటేష్, కార్యదర్శి రూపేష్, జనసైనికులు ఉన్నారు.