తొండపిలో వైసీపీ శ్రేణుల దుర్మార్గపు దాడిని ఖండిస్తున్నాం

సత్తెనపల్లి: ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు తమ విధివిధానాలను స్వేచ్ఛగా ప్రచారం చేసుకునే హక్కు భారత రాజ్యాంగం కల్పించిందని, అటువంటి ప్రచార కార్యక్రమంలో భౌతికదాడులకు దిగి అడ్డుకోవడం సిగ్గుమాలిన చర్యని సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు అన్నారు. ఈ రోజు సాయంత్రం స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి సిరిగిరి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని, నిన్న ఉత్తరాంధ్రలో సిద్ధం అంటూ సాక్షాత్తు సీఎం గారే నిర్వహించిన సభలో ప్రతిపక్ష నేతల వ్యంగ్య చిత్రాలను ఏర్పాటుచేసి తమ కార్యకర్తల చేత పిడిగుద్దులు గుద్దించడం వారి ఉన్మాద వైఖరికి నిదర్శనమని అన్నారు. ముప్పాళ్ళ మండలం తొండపిలో వైసీపీ శ్రేణులు చేసిన దుర్మార్గపు దాడిని ఖండిస్తున్నామని తెలిపారు. జిల్లా అధికార ప్రతినిధి తవిటి భావనారాయణ మాట్లాడుతూ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ముప్పాళ్ళ మండలం తొండపి గ్రామంలో పర్యటిస్తున్న మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గారి బృందంపై జరిగిన రాళ్ల దాడిని తీవ్రంగా ఖండించారు. దొంగ దొంగ అని అరిచినట్లు దాడులు చేసినవారే నాటకాలు ఆడుతూ ఆసుపత్రిలో అడ్మిట్ అయి ఉంటే స్థానిక మంత్రిగారు వారిని పరామర్శించడం, తెలుగుదేశం కార్యకర్తలపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. మరో జిల్లా సంయుక్త కార్యదర్శి తిరుమలశెట్టి మల్లీశ్వరి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును కోరి, సాధించి ప్రత్యర్ధులను గెలవాలి తప్ప భౌతిక దాడులతో కాదని అన్నారు. ఈ పత్రిక సమావేశంలో రాజుపాలెం మండలం ఉపాధ్యక్షులు పసుపులేటి వెంకటస్వామి, అంచులు అనేష్ కుమార్, నకిరేకల్ మండలం ఉపాధ్యక్షులు బత్తిన శ్రీనివాసరావు,జనసేన పార్టీ కార్యాల ఇన్చార్జి సిరిగిరి మణికంఠ, అంబటి పున్నారావు, తిరుమల శెట్టి సాంబశివరావు, ఐలం ఆదినారాయణ, అవుల నాగరాజు, గలబా మురళి, బత్తిన సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.