విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినదించిన ఆంధ్ర జనం

• అన్నదాతల నుంచి గొర్రెల కాపర్ల వరకు..
• కళ్యాణ మండపాల నుంచి కాడెద్దుల వరకు
• ప్రజాకాంక్షను వ్యక్తపరిచిన జనసేన డిజిటల్ క్యాంపెయిన్

పార్లమెంటు సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ కి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలకు వారి బాధ్యతను గుర్తు చేయండి… విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం పోరాడండి అంటూ జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు జనసేన శ్రేణులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు చేరింది. జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డిజిటల్ క్యాంపెయిన్ చివరి రోజు ఆంధ్రుల ఆకాంక్షను అధికార పార్టీ ఎంపీలకు సెగ తగిలే స్థాయికి వెళ్లింది. పొలంలో నాట్లు వేస్తున్న కూలీలు, దమ్ము చేస్తున్న ట్రాక్టర్ డ్రైవర్.. ఏరువాక సాగేందుకు నాగలితే బయలు దేరిన అన్నదాత.. కట్టుబడులకు సిద్ధమైన పొలం నుంచి సాగరతీరంలో పుణ్యస్నానాలకు వెళ్లిన భక్తుల వరకు.. రోజు కూలీల నుంచి రోడ్ సైడ్ వ్యాపారుల వరకు.. గొర్రెల కాపర్లు.. పెళ్లి వేడుకకు సిద్ధమైన కళ్యాణ వేదికలు.. రహదారులు.. జాతీయ నాయకుల విగ్రహాలతో కూడిన కూడళ్లు.. ఎక్కడ చూసినా ఒకటే నినాదం.. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు.. శ్రీ పవన్ కళ్యాణ్ సూచించిన హ్యాష్ ట్యాగ్ తో పాటు ప్లకార్డులు ప్రత్యక్షమైపోయాయి. విశాఖ ఉక్కు పరిరక్షణ బాధ్యతను, ఆంధ్రుల ఆత్మగౌరవ కాంక్షను రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరిలో నింపే లక్ష్యంతో జనసేన శ్రేణులు డిజిటల్ క్యాంపెయిన్ ను నిర్వహించాయి. శ్రీ పవన్ కళ్యాణ్ చెప్పిన చివరి రోజు నినాదం మీ ప్రాణాలు త్యాగాలు మాకొద్దు పార్లమెంటులో ప్లకార్డులు చూపితే చాలు అనే నినాదాన్ని జనసేన నాయకులు, కార్యకర్తలు ప్రజల మధ్యకు తీసుకువెళ్లాయి. ప్రజల్లో ఉద్యమ కాంక్ష రాజేసే ఏ ఒక్క అవకాశాన్ని వదలకుండా డిజిటల్ క్యాంపెయినింగ్ ను విజయవంతం చేశాయి. అందుకోసం నియోజకవర్గాల ఇంఛార్జులు నాట్లకు సిద్ధంగా ఉన్న బురద చేలల్లో దిగారు. కార్యకర్తలు పనుల కోసం పొలం గట్ల మీద సిద్ధంగా ఉన్న కూలీలను పలుకరించారు. ప్రతి ఒక్కరి చేతిలో ప్లకార్డు పెట్టడంతో పాటు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు దాని పరిరక్షణ ప్రతి ఆంధ్రుడి బాధ్యత అని వివరించారు. ప్రజల ఓట్లతో పార్లమెంటులో కూర్చుని ప్రజల ఆకాంక్షలను వ్యక్త పర్చలేని ఎంపీల వైఖరిని దుయ్యబట్టారు. జనసేన పార్టీ డిజిటల్ క్యాంపెయిన్ దెబ్బకి సామాజిక మాధ్యమాలు కూడా షేకయ్యాయి. జాతీయ స్థాయిలో ఆంధ్ర ప్రజల ఆకాంక్షను వ్యక్తపరిచేలా చేశాయి. విశాఖ ఉక్కు వ్యవహారంలో అధికార పార్టీ వైఖరి మార్చుకోకుంటే శ్రీ పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు తదుపరి కార్యచరణకు సిద్ధమన్న సంకేతాన్ని జనసేన శ్రేణులతో పాటు ప్రజలు పంపడం గమనార్హం.